‘ఆ ఆరుగురు అక్కచెల్లెళ్ల’ బాధ్యత మాది : కేటీఆర్ భరోసా

10TV Telugu News

కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ‘ఆ ఆరుగురు అక్కచెల్లెళ్ల’ బాద్యత తాను చూసుకుంటానని తెలంగాణ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్విట్టర్‌ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజల కష్టాలు తీర్చుతున్న మంత్రి కేటీఆర్‌ సమస్యల పట్ల ఎంత స్పీడ్ గా స్పందిస్తారో మరోసారి నిరూపించారు. ‘పెంచికల్ పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామం తోటపల్లి రాజ్యం భూమి లేని ఓ నిరుపేద దళిత కూలి కుటుంబం ఇది’ అంటూ ట్విట్లర్ లో పేర్కొన్నారు.గత సంవత్సరం అనారోగ్యంతో ఆ కూలీ మృతిచెందగా అతని భార్య కూడా గత వారం రోజుల క్రితం మృతి చెందింది. తల్లిదండ్రుల మరణంతో ఆ ఆరుగురు ఆడపిల్లలు దిక్కులేని అనాథలు అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెంచికల్ పేర్ మండలంలోని ఎలకలపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి రాజం, రాజ్యలక్ష్మీ దంపతుల కుమార్తెలే ఐశ్వర్య(16), మానస(14), హారిక(13), మౌనిక (12), హరిణి(10), స్వేచ్చశ్రీ(6)లు.వీరి ఆరుగురు ఆడ పిల్లలు అనాథలయ్యారని, తల్లిదండ్రులు మరణించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు. ‘ఆ ఆరుగురు అక్కచెల్లెళ్ల’ బాగోగులను మేము చూసుకుంటాం’ అంటూ కేటీఆర్‌ ట్వీట్ ద్వారా హామీ ఇచ్చారు. స్థానిక కలెక్టర్‌ను సంప్రదించి ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరిగేలా చూడాలని తన కార్యాలయ సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశించారు.×