ముదురుతోంది : సీఎస్ సమీక్షలపై యనమల ఫైర్

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 06:06 AM IST
ముదురుతోంది : సీఎస్ సమీక్షలపై యనమల ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వర్సెస్ అధికార పార్టీ లాగా నడుస్తోంది. వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పునేఠాను బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమించింది. అప్పటి నుండి అభిప్రాయ భేదాలు వ్యక్తమౌతున్నాయి. సీఎస్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని..ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రివ్యూలు జరిపినా సీఎస్ వెళ్లకపోవడంపై పలువురు ఆక్షేపిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై మంత్రి యనమల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

పేదల పథకాలకు నిధుల విడుదలను సీఎస్ ప్రశ్నించడం అహేతుకమన్నారు. సంక్షేమ పథకాలకు నిధుల విడుదలను ప్రశ్నించడం అహేతుకమన్నారు. మూడు స్కీములకు బడ్జెట్‌లో నిధులు లేవనడం ఏంటీ అని మండిపడ్డారు యనమల. ఆ స్కీమ్‌లకు ఓటాన్ అకౌంట్ కింద బడ్జెట్ కేటాయించడం జరిగిందన్నారు. కొత్తగా వీటిపై సీఎస్ రివ్యూ చేయడం హాస్యాస్పదమని..నిధుల కేటాయింపుపై బడ్జెట్‌ స్పీచ్‌లోనే చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవకు రూ. 5వేల కోట్లు, పసుపు – కుంకుమకు రూ. 4వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని కూడా కోర్టులు చెప్పినట్లు వెల్లడించారాయన. 

* గతంలో జరిగిన వ్యవహారాల్లో ఎల్వీ సుబ్రమణ్యం వేలు పెడుతుండడంపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేబినెట్ చేసిన నిర్ణయాలపై ఎల్వీ సుబ్రమణ్యం కామెంట్లు చేయడంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
* ఎన్నికల ముందు పసుపు కుంకుమకు 9వేల కోట్ల రూపాయలు, రైతు రుణమాఫీ నాలుగో విడతకు 3,300 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి 2,200 కోట్ల రూపాయల చెల్లింపులపై ఆర్థికశాఖ అధికారులను సీఎస్‌ ప్రశ్నించారు.