అమరావతి అభివృద్ధి గ్రాఫిక్స్ : అక్కడేమో కంపచెట్లు ఉన్నాయ్

ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై రివ్యూలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

  • Published By: vamsi ,Published On : April 19, 2019 / 08:11 AM IST
అమరావతి అభివృద్ధి గ్రాఫిక్స్ : అక్కడేమో కంపచెట్లు ఉన్నాయ్

ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై రివ్యూలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపై రివ్యూలు చేయడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ ని అన్నింటినీ స్కీములకు ఇచ్చేసి చంద్రబాబు ఇప్పుడు రివ్యూలు అంటున్నారని మండిపడ్డారు. మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేవని బుగ్గన అన్నారు.
Also Read : ఈ-సిగిరెట్లు ప్రమాదం: ప్రధానికి లేఖ రాసిన డాక్టర్లు

రాష్ట్ర ఖజానా మొత్తాన్ని పసుపు కుంకుమ, పెన్షన్లు, అన్నదాత సుఖీభవ స్కీములకు ఇచ్చేసి చంద్రబాబు ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. 2014నుంచి 2019వరకు ప్రభుత్వం పోలవరంను పట్టించుకోలేదని ఆరోపించారు. పట్టిసీమకు 1600కోట్లు పెట్టి అవినీతి చేశారని, దాదాపు 600కోట్లు ఎక్కువ ఖర్చు పట్టిసీమకు పెట్టారని  కాగ్ చెప్పిందని అన్నారు. కాంట్రాక్టర్ల కోసం బిల్లులు చేశారని విమర్శించారు.

రాజధానికి 1500 ఎకరాలు అవసరం అని చెప్పిన ప్రభుత్వం.. 33వేల ఎకరాల భూమిని సేకరించి, ప్రభుత్వ భూమితో కలిపి లక్ష ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ చేశారని అన్నారు. రాజమౌళి చేత డిజైన్లు చేయించి అమరావతిని కట్టకుండా మాటలు చెప్పారని అన్నారు. గ్రాఫిక్స్ చూపెట్టి అమరావతి కట్టేసినట్లు..చెబుతున్నారని..అక్కడేమో కంప చెట్లు ఉన్నాయని అన్నారు.

అవినీతి సహించమూ అంటూ.. అవినీతి చేసింది ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. తనకు నచ్చిన వ్యక్తులకు తక్కువ రేటుకు భూములను కట్టబెట్టి కేంద్ర సంస్థలకు మాత్రం ఎక్కువ రేటు చెబుతారని బుగ్గన అన్నారు. 
Also Read : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఖర్చు ఎంతో తెలుసా?