కరోనా వణుకు..parliament meetings కుదిస్తారా!

  • Published By: madhu ,Published On : September 19, 2020 / 03:21 PM IST
కరోనా వణుకు..parliament meetings కుదిస్తారా!

కరోనాతో ఎంపీలు వణికిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా…ఎంపీలకు వైరస్ సోకుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎన్నో జాగ్రత్తలు, కరోనా మార్గదర్శకాలు తీసుకుంటున్నా..రోజుకొకరు ఎంపీలు వైరస్ బారిన పడుతున్నారు.




పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఇప్పటికే కరోనా సోకడంతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మరింత మంది ఎంపీలకు కరోనా రాకుకుండా ఉండేందుకు వర్షాకాల సమావేశాలను కుదించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. లోక్ సభ, రాజ్యసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే కీలక బిల్లులను అతి తొందరగా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే..దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కరోనా నేపథ్యంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు 2020, సెప్టెంబర్ 14వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సమావేశాలు అక్టోబర్ 01 వరకు కొనసాగాల్సి ఉంది.




కానీ..ప్రస్తుతం వైరస్ ఎక్కువ మంది ఎంపీలకు సోకుతుండడంతో కేంద్రం సమావేశాలు కొనసాగింపుపై పునరాలోచించాలని భావిస్తోంది. హోం మంత్రి అమిత్ షా, రవాణా మంత్రి గడ్కరితో పాటు మరికొంతమంది మంత్రులకు వైరస్ సోకింది. పార్లమెంట్ కు రావాలంటేనే జంకుతున్నారు. మరి పార్లమెంట్ సమావేశాలు కుదిస్తారా ? లేదా ? అనేది చూడాలి.