ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదు : కూతురిని చంపేయాలని అమ్మ అభ్యర్థన

ఇలాంటి కష్టం, బాధ ఏ తల్లికీ రాకూడదు. ఇలాంటి వేదన ఏ తల్లీ పడకూడదు. కన్నకూతురిని చంపేయాలని అభ్యర్థించాల్సిన దీనావస్థ ఏ అమ్మకీ రాకూడదు. వివరాల్లోకి వెళితే..

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 11:32 AM IST
ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదు : కూతురిని చంపేయాలని అమ్మ అభ్యర్థన

ఇలాంటి కష్టం, బాధ ఏ తల్లికీ రాకూడదు. ఇలాంటి వేదన ఏ తల్లీ పడకూడదు. కన్నకూతురిని చంపేయాలని అభ్యర్థించాల్సిన దీనావస్థ ఏ అమ్మకీ రాకూడదు. వివరాల్లోకి వెళితే..

ఇలాంటి కష్టం, బాధ ఏ తల్లికీ రాకూడదు. ఇలాంటి వేదన ఏ తల్లీ పడకూడదు. కన్నకూతురిని చంపేయాలని అభ్యర్థించాల్సిన దీనావస్థ ఏ అమ్మకీ రాకూడదు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విజయవాడలో కూతురి మెర్సీ కిల్లింగ్ కోసం ఓ కన్నతల్లి గవర్నర్ కి వినతి పెట్టుకుంది. ఈ బాధ నేను చూడలేదు, నా కూతురుని చంపేయండి అని అభ్యర్థించింది.

కన్నబిడ్డ కళ్లముందే నరకం అనుభవిస్తుంటే ఆ తల్లి పేగు బంధం విలవిలలాడింది. అరుదైన వ్యాధితో కూతురు నరకం అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక.. తన బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని ఏపీ గవర్నర్‌ కి విజ్ఞ‌ప్తి చేసింది. తన కూతురికి వైద్యం చేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదని.. మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరింది. ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడలో జరిగిన ఈ ఘటన కంటతడి పెట్టిస్తోంది. 

విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన హాచ్‌ మెన్, స్వర్ణలత దంపతులకు 2000లో జాహ్నవి జన్మించింది. నాలుగేళ్ల వయసులో అరుదైన మానసిక వ్యాధి వచ్చింది. వైద్య పరీక్షలు చేయించగా.. మల్టీ లొకేటెడ్ హైడ్రో కెపాలస్ వ్యాధిగా తేలింది. తర్వాత ఎనిమిదేళ్లకే జాహ్నవికి గైనిక్ సంబంధ సమస్యలు వచ్చాయి. జాహ్నవి తండ్రి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగి కావడంతో అక్కడే ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 

2017లో గైనిక్ హెచ్‌వోడి రాజలక్ష్మి అపాయింట్ అయ్యారు. జాహ్నవికి వైద్యం అందించేందుకు ఆమె నిరాకరించారు. కారణం అడిగినా పొంతనలేని సమాధానాలు రావడంతో జాహ్నవి తల్లి కోర్టును ఆశ్రయించారు. తన సమస్యను పిటిషన్ రూపంలో వినిపించగా.. కోర్టు వైద్యం అందించాలని ఆస్పత్రిని ఆదేశించింది. కానీ రాజ్యలక్ష్మి మాత్రం ఆ ఆదేశాలను పట్టించుకోలేదు.. జాహ్నవికి వైద్యం అందించలేదు. ఇక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించే పరిస్థితి లేదు. 

జాహ్నవి ఆరోగ్య సమస్యంలు పెరిగాయి. ఆస్పత్రిలో వైద్యం అందకపోవడంతో తల్లి స్వర్ణలత కుంగిపోయింది. కూతురు పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. మెర్సీ కిల్లింగ్ (కారుణ్య మరణం) కోసం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విజ్ఞ‌ప్తి చేసింది. నా బిడ్డ బాధను చూడలేకపోతున్నాను.. నరకం అనుభవించడం కంటే చనిపోవడం మంచిది.. అందుకే మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి కోరుతూ గవర్నర్‌ను ఆశ్రయించినట్లు స్వర్ణలత చెప్పింది. దీనిపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఈ ఘటన అందరిని కంటతడి పెట్టిస్తోంది. అయ్యో పాపం అని జాలి చూపిస్తున్నారు. ఇలాంటి కష్టం ఏ తల్లికీ రాకూడదని అంటున్నారు. కనీసం మానవత్వం చూపించకుండా వైద్యం చేయడానికి నిరాకరించిన డాక్టర్ పై మండిపడుతున్నారు.