ఈసీకి ఉత్తమ్ లేఖ : స్థానికేతరులు ఉండొద్దన్న డీఎస్పీ

  • Published By: madhu ,Published On : October 20, 2019 / 09:44 AM IST
ఈసీకి ఉత్తమ్ లేఖ : స్థానికేతరులు ఉండొద్దన్న డీఎస్పీ

సూర్యాపేటలోని ఎంపీ ఉత్తమ్ నివాసానికి డీఎస్పీ సుదర్శన్ రెడ్డి చేరుకున్నారు. ప్రచారం గడువు ముగిసినందున నిబంధనల ప్రకారం స్థానికేతరులు నియోజకవర్గం నుంచి విడిచి వెళ్లాలని డీఎస్పీ కోరారు. ఈయన నల్గొండ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ అంశంపై ఈసీకి 2019, అక్టోబర్ 20వ తేదీ ఆదివారం లేఖ రాశారు ఉత్తమ్. చాలాకాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లు ఆయన లేఖలో వెల్లడించారు. ఈ ప్రాంత ఎంపీని అని తెలిపారు. లేఖపై ఈసీ అధికారులు మౌఖికంగా స్పందించినట్లు సమాచారం. వ్యక్తిగత నివాసంలో ఉండేందుకు ఉత్తమ్‌కు ఈసీ అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. 

హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం అక్టోబర్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం ముగిసిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం స్థానికేతరులు నియోజకవర్గంలో ఉండటానికి వీల్లేదు. ఈ ఎన్నిక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఉంది. కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. కంచుకోట స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. పోటీ ప్రధానంగా  టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యనే నడుస్తోంది. టీడీపీ, బీజేపీ పార్టీలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కోట రామారావు, టీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి పోటీ చేస్తున్నారు. మొత్తం రెండు లక్షల 36 వేల మంది ఓటర్లు అక్టోబర్ 21వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమ పార్టీ గెలుస్తుందని టీఆర్ఎస్ – కాంగ్రెస్ భావిస్తున్నాయి. మూడుసార్లుగా హుజూర్ నగర్‌లో హ్యాట్రిక్ విజయాన్ని ఉత్తమ్ సాధించారు. అయితే..హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలోనే తెలంగాణ ఆర్టీసీ సమ్మె రావడంతో దీని ప్రభావం ఉంటుందా ? అనేది ఆసక్తికరంగా మారింది. 
> అక్టోబర్‌ 21వ తేదీన హుజుర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక. 
> అక్టోబర్ 21న పోలింగ్. 
> అక్టోబర్ 24వ తేదీన కౌంటింగ్. 
Read More : దీపావళి సెలబ్రేషన్ వద్దు : భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ