పరారీలో ఉన్న ఎమ్మార్వో హసీనబి కేసు : వెలుగులోకి కొత్త కోణాలు.. MPDOతో సహజీవనం

కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి... కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 08:28 AM IST
పరారీలో ఉన్న ఎమ్మార్వో హసీనబి కేసు : వెలుగులోకి కొత్త కోణాలు.. MPDOతో సహజీవనం

కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి… కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం

కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి… కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం గాలిస్తున్న పోలీసులు… కర్నూలులోని ప్రభుత్వ క్వార్టర్స్‌లోని సీ క్యాంప్‌లో ఆమె షెల్టర్ తీసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. క్వార్టర్ నెంబర్ 40లో సోదాలు జరిపారు. ఈ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.

అయితే ఈ కేసులో మరిన్ని కొత్తకోణాలు కూడా బయటపడుతున్నాయి.  కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. హసీనబి పరారీకి గిడ్డయ్య సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. నవంబర్ 8 నుంచి ఎంపీడీవో గిడ్డయ్య కూడా విధులకు సెలవు పెట్టి కనిపించకుండా పోయాడని చెబుతున్నారు.

ఎమ్మార్వో  కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనబీని పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ.. విచారణ ముమ్మరం చేశారు. విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు బీ, సీ క్యాంపుల్లోని 7 హాస్టళ్లలో హసీనా రూములు తీసుకున్నట్టు గుర్తించారు. అంతేకాదు అన్ని హాస్టళ్లకు ప్రతి నెల రూమ్ రెంట్ కూడా చెల్లిస్తున్నారని గుర్తించారు. అయితే ఇన్ని హాస్టళ్లలో రూములు ఎందుకు తీసుకున్నారు అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు హసీనబికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే.. వాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. హసీనబి బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఆమె ఇంటికి వస్తే కచ్చితంగా సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. 

లంచం కేసులో ఎమ్మారో హసినబీ అడ్డంగా దొరికిపోయారు. సురేష్‌ అనే వ్యక్తి నుంచి తహసీల్దార్ హసినబీ రూ.4 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. దాంతో సురేష్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సురేష్ కి రూ.4 లక్షలు డబ్బులిచ్చి పంపారు. అయితే తహసీల్దార్ తెలివిగా వ్యవహరించారు. తనకు నమ్మకస్తుడైన బాషా అనే వ్యక్తి.. వేరే చోట ఉంటాడని అతనికి లంచం డబ్బు ఇవ్వాలని చెప్పారు. ఆమె చెప్పినట్టే సురేష్.. బాషాకు లంచం డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్వో హసీనబి పారిపోయారు.