ముహూర్త బలం : 22న నామినేషన్‌ వేయనున్న బాబు, జగన్, పవన్

అమరావతి: రాజకీయాల్లో ప్రజాబలం ఎంత ముఖ్యమో, గ్రహాల బలం కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంటారు నాయకులు. ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 02:30 PM IST
ముహూర్త బలం : 22న నామినేషన్‌ వేయనున్న బాబు, జగన్, పవన్

అమరావతి: రాజకీయాల్లో ప్రజాబలం ఎంత ముఖ్యమో, గ్రహాల బలం కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంటారు నాయకులు. ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు

అమరావతి: రాజకీయాల్లో ప్రజాబలం ఎంత ముఖ్యమో, గ్రహాల బలం కూడా అంతే ముఖ్యమని నమ్ముతుంటారు నాయకులు. ఏ పని చేపట్టాలన్నా ముహూర్తం లేనిదే ముందుకు కదలరు. ప్రచారం దగ్గర నుంచి నామినేషన్ దాఖలు వరకు అన్నింటికీ ముహూర్తాలు చూసుకునే చేస్తుంటారు. ఎన్నికల సమయంలో జ్యోతిష్యులకు ఉండే క్రేజే వేరు. వారు చెప్పిందే వేదంగా అమలు చేస్తుంటారు నేతలు. ఏపీ ఎన్నికల్లోనూ నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం వరకూ అందరు నేతలు ముహూర్తాలను తెగ ఫాలో అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సోమవారమే (మార్చి 18,2019) నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటికీ.. ముహూర్త బలం సరిగా లేకపోవడంతో .. నేతలు అంతగా ఆసక్తి చూపలేదు. ఏపీలో టీడీపీ, వైసీపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. నామినేషన్ల దాఖలుకు మార్చి 25 తుది గడువు కావడంతో .. ప్రస్తుతం నేతలు ఆ పనిలో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం నామినేషన్ల దాఖలకు 5 రోజులు మాత్రమే గడువుంది. ఈ 5 రోజుల్లో 2 రోజులు సెలవులు వచ్చాయి. మార్చి 23 శనివారం, 24 ఆదివారం రోజున నామినేషన్ల దరఖాస్తుకు అవకాశం లేదు. ఇక మిగిలింది.. అందులోనూ మంచి ముహూర్తాలు ఉన్నది మాత్రం మార్చి 21, 22, 25 మాత్రమే. బుధవారం కొంతమంది నామినేషన్లు దాఖలు చేశారు. శుక్ర, సోమవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

అటు ముఖ్యమంత్రి అభ్యర్ధులు చంద్రబాబు, జగన్‌, పవన్‌  కూడా ముహూర్తాలను ఫాలో అవుతున్నారు. ఈ నేతలు ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. ఎవరికి వారు తమ సిద్దాంతులు చెప్పిన రోజులను అనుసరిస్తున్నారు. చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ మార్చి 22 విదియ, హస్తా నక్షత్రం కావడంతో .. ఆ రోజు నామినేషన్‌ దాఖలు చేయాలని చూస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 21, 22 తేదీల్లో రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేస్తారురు. లోకేష్‌ మంగళగిరి నుంచి ఈ నెల 22న కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రులు కూడా ఆ రోజే నామినేషన్‌ వేస్తున్నారు.

25వ తేదీ ఆఖరు రోజు కూడా చాలా మంచిదని జ్యోతిష్కులు చెబుతుండటంతో… అన్ని పార్టీలకు చెందిన నేతలు ఆ రోజు ముహూర్తాన్ని ఖరారు చేసుకుంటున్నారు. రాజకీయ నేతలకు గురు, శుక్ర బలం అనేది కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాక పార్టీ అధ్యక్షుల గ్రహబలాన్ని బట్టి కూడా నామినేషన్‌ వేసేవారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. గురు ముహూర్తం వ్యక్తితో పాటు జాతకంపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు.

మరోవైపు జాతకంలో బలం లేకపోతే రాజకీయ నాయకులు ఎంత తాపత్రయపడ్డా గెలుపు అంచులవరకు మాత్రమే వస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కానీ అతనికి గెలుపు వరించదంటున్నారు. మొత్తం మీద నేతలు అంతగా ఫాలో అవుతున్న ముహూర్తాలు వారికి విజయావకాశాలు అందిస్తాయో.. లేదో చూడాలి.