ఆ గ్రామం జనాభా 500..వారిలో 100మందికి కరోనా..!! ఊరంతా ఐసోలేషలోనే..

  • Published By: nagamani ,Published On : September 3, 2020 / 11:49 AM IST
ఆ గ్రామం జనాభా 500..వారిలో 100మందికి కరోనా..!! ఊరంతా ఐసోలేషలోనే..

కరోనా..కరోనా నువ్వేం చేస్తావు? అంటే.. ముట్టుకోకుండానే అంటుకుంటాను అంటోంది. పేదా గొప్పా తేడా లేకుండా..ఎవ్వరినైనా సరే ముట్టుకోకుండానే అంటుకుంటా..నేనంటే భయం లేకపోతే తీసుకుపోతా..చచ్చాక కూడా నీ చుట్టుపక్కల నా అనేవారు కూడా లేకుండా చేస్తానంటూ థమ్కీలిస్తోంది. కానీ ప్రజల్లో మాత్రం జాగ్రత్తలు కనిపించట్లేదు. లైట్ తీస్కుంటున్నారు కరోనా అంటే…కానీ అదిమాత్రం ఊర్కుంటుందా?..మహమ్మారి కదా..నా రూల్ బ్రేక్ చేస్తే బ్రేకప్ లేకుండా టేకప్ చేసి తీస్కెళ్లిపోతానంటోంది. మంది ఎక్కువగా ఉంటే అంటుకుంటానంటోంది.



అదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలోనే ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో. ఈ ఊరిలో ప్రజలందరికీ దాదాపు కరోనా సోకడం కలకలం రేపుతోంది. ఈ గ్రామ పంచాయతీలో 500 జనాభా ఉంటే 100కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవటం అధికారుల్ని కలవరానికి గురిచేస్తోంది.
https://10tv.in/two-types-of-steroid-found-to-save-lives-of-some-covid-19-patients/
దీంతో అధికారులు హడావిడిగా రంగంలోకి దిగారు..అసలు ఇంతమందికి కరోనా ఎలా సోకిందని ఆరా తీయగా..ఓ దినకర్మ సహపంక్తి భోజనాలే కారణమని తేలింది. సహపంక్తి భోజనాలు చేసిన సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ స్థాయిలో కరోనా బాధితులు బయటపడంతో ఊరిలోని మిగిలిన జనాలు కూడా కరోనా టెస్ట్‌లు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. మిగతా వాళ్లు కూడా కరోనా టెస్టులు చేయించుకుంటే ఇంకెంతమందికి కరోనా పాజిటివ్ అని తేలుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.



జరగాల్సిన ఘోరం కాస్తా జరిగాక గ్రామంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం గ్రామస్తులంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అధికారులు గ్రామ రహదారులన్నింటినీ దిగ్బంధం చేశారు. తెలంగాణలో కొత్తగా 2817 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గదీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 133406కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 32,537 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.