EXCLUSIVE: కర్నూలుకు హైకోర్ట్..చెవిలో పువ్వులు పెట్టొద్దు..మీకంటే మేధావులున్నారు : మైసూరా

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 09:50 AM IST
EXCLUSIVE: కర్నూలుకు హైకోర్ట్..చెవిలో పువ్వులు పెట్టొద్దు..మీకంటే మేధావులున్నారు :  మైసూరా

మూడు రాజధానులు రాజధానులు అంటూ సీఎం జగన్ ప్రతిపాదనతో..ప్రతీనోటా ఇదే మాట వినిపిస్తోంది. ఆల్ రెడీ విశాఖ డెవలప్ అయిపోయింది. ఎయిర్ పోర్ట్..షిప్ యార్డ్..రైల్వే కనెక్టివిటీ ఉంది కాబట్టి విశాఖను పరిపాలనా రాజధాని అనీ..కర్నూలులో విశాఖకు ఉన్న డెవలప్ మెంట్ లేదు కాబట్టి జ్యుడిషియల్ రాజధాని అంటూ ప్రకటించారనే ప్రశ్నకు సమాధానంగా 10టీవీకీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ మైసూరా రెడ్డి మాట్లాడుతూ…మూడు రాజధానుల్లో ఒకటి విశాఖలో పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కానీ పైకి మాత్రం విశాఖ డెవలప్ అయి ఉంది కాబట్టి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదనీ అందుకే అక్కడ పాలనా రాజధాని అంటున్నారు. కానీ ఇవన్నీ రాయలసీమ వాసుల చెవిలో సీఎం జగన్ పువ్వులు పెట్టేలా మాట్లాడుతున్నారనీ ఎద్దేవా చేశారు. 

జగన్ పెద్ద మేధావిలా మాట్లాడుతున్నారు..ఆయన్ని మించివారు ఎంతోమంది సీమలో ఉన్నారు..వారితో సమావేశమై..ఈ అంశంపై భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని మైసూరా అన్నారు. ఎకానమీ గురించి, క్యాపిటల్ డెవలప్ మెంట్ ఎలా చేయాలో తెలిసిన మేధావులు చాలామంది ఉన్నారనీ  ఈ విషయం పాలకులు తెలుసుకోవాలని అన్నారు. 

పాలను వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పాలకు అంటున్నారు. ఇది కరెక్టే కానీ వికేంద్రీకరణలో న్యాయం జరగాలని అటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు మైసూరారెడ్డి.వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు హైకోర్ట్ బెంచ్ అనేది కంటి తుడుపు చర్యే తప్ప రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదనీ అన్నారు.