వైసీపీ నేతలపై నాగబాబు : సున్నా విలువ తెలియని సన్నాసులు..వెధవలు

  • Edited By: veegamteam , January 18, 2020 / 07:50 AM IST
వైసీపీ నేతలపై నాగబాబు : సున్నా విలువ తెలియని సన్నాసులు..వెధవలు

వైసీపీ నేతలపై జనసేన నేత నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీరో విలువ తెలియని వెధవలకు ఏం చెప్పినా… చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటూ నాగబాబు మండిపడ్డారు. సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యాథ్స్‌ ఇంత డెవలప్‌ అయ్యాయంటే.. సున్నా మహత్యమేరా… చదువుకున్న సన్నాసుల్లారా’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంబటి, అవంతి, పేర్ని నానిపైనా నాగబాబు సెటైర్లు వేశారు. వైసీపీ నేతల వల్ల ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ లేని లోటు తీరిందంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

కాగా ఇటీవల జనసేన, వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుండు సున్నా దేనితోనైనా కలిసినా, విడిపోయినా ఫలితం జీరోనే. సున్నాను తలపైన ఎత్తుకున్నా, చంకలో  పెట్టుకున్నా జరిగేదదే. ఇది పదేపదే నిరూపితమవుతూనే ఉంటుంది. అయినా ప్రయోగాలకు సాహసించే వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. దెబ్బతింటుంటారు. మనం పాపం అనుకుంటూ వదిలేయాలి అంటూ వ్యాఖ్యానించారు. 

అంతేకాదు..యాక్టర్ నిమిత్తమాత్రుడు. నడిపించేది, వెనక నుంచి నెట్టేది, డైరెక్ట్ చేసేది, స్క్రిప్ట్ చేతి కందించేది, పేమెంట్ ఇచ్చేది యజమాని స్థానంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీనే. కమ్మూనిస్టులతో కలిసినా, బిఎస్పీ కాళ్లు పట్టుకున్నా, కమలం వైపు కదిలినా ఆదేశించేది ఆయనే. దీనిపై జనసేన నేత, సినీ నటుడు నాగబాబు తీవ్రస్థాయిలో స్పందించారు.