వైసీపీ నేతలపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

  • Edited By: veegamteam , January 10, 2020 / 06:56 AM IST
వైసీపీ నేతలపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేతలపై సీనీ నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల ఆందోళనలను ఉద్దేశించి అధికార పార్టీ నేతలు హేళన చేస్తూ..చులకన చేస్తూ మాట్లాడటంపై జనసేన నేత..సినీ నటుడుడు నాగబాబు ఓ ట్వీట్ చేశారు. రాజధాని రైతులపై తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. వారి గదుల్లో కాకుండా ఒకసారి రాజధాని ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడాలన్నారు. అప్పుడు వారికి రైతులు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉందని ట్వీట్ చేశారు.

ఏపీలో అమరావతి రైతుల ఆందోళనలు ఉధ‌ృతంగా సాగుతున్నాయి. రాజధాని మార్పును తీవ్రంగా నిరసిస్తూ.. వివిధ రూపాల్లో నిరసనలను హోరెత్తిస్తున్నారు. విశాఖపట్నానికి అమరావతి తరలింపుపై అమరావతి ప్రాంతాల్లోని గ్రామాలు అట్టుడుకుతున్నాయి. ఆందోళనలు మిన్నంటున్నాయి.

అమరావతి ప్రాంత రైతులు..మహిళలపై వైసీపీ నేతలు చేస్తున్న దారుణమైన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతలు గదుల్లో కూర్చుని మాట్లాడటం కాదు అమరావతి గ్రామాల్లోకి వచ్చి మాట్లాడండీ..అప్పుడు ఆ రైతులు మీకు చేసే సన్మానం ఎలా ఉంటుంది కళ్లారా చూడాలని ఉంది అన్నారు.