కర్ణాటకలో కళ్యాణ్‌కు సెక్యురిటీ 900మంది.. జగన్ ప్రభుత్వం మాత్రం డెబ్బై మందిని ఇచ్చింది: నాగబాబు

  • Published By: vamsi ,Published On : November 3, 2019 / 12:07 PM IST
కర్ణాటకలో కళ్యాణ్‌కు సెక్యురిటీ 900మంది.. జగన్ ప్రభుత్వం మాత్రం డెబ్బై మందిని ఇచ్చింది: నాగబాబు

విశాఖపట్నంలో జనసేన ఆధ్వర్యంలో సాగిన లాంగ్ మార్చ్ ర్యాలీలో మెగా బ్రదర్ నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు కాన్ఫిడెంట్ గా మాట్లాడవచ్చు కానీ, పొగరుగా మాట్లాడకూడదని అన్నారు నాగబాబు. వాళ్లు ఎంత పొగరుగా మాట్లాడినా అంతకు వెయ్యి రెట్లు పొగరుగా జనసేన మాట్లాడగలదని అన్నారు నాగబాబు. ఇదే సమయంలో జనసేన లాంగ్ మార్చ్ అడ్డుకునేందుకు వైసీపీ ఎంతో ప్రయత్నించిందని అన్నారు నాగబాబు.

కర్ణాటకలో గుడి ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ వెళ్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం 900మంది పోలీసులను సెక్యురిటీగా ఇచ్చింది, ఇక్కడి వైసీపీ ప్రభుత్వం మాత్రం 90మందిని కూడా ఇవ్వలేదని, ఎలాగైనా సరే మీటింగ్ జరగకూడదు అని 70మంది పోలీసులను మాత్రమే ప్రభుత్వం సెక్యురిటీ ఇచ్చిందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ ఆగదు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నష్టానికి భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ. 10 వేలా 15వేలా? అని తక్కువ కాకుండా ఇవ్వాలి అని నాగబాబు డిమాండ్ చేశారు.

ఇప్పటికే 8మంది, 9మంది చనిపోయారు. అని కానీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదని అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పైన కూడా విమర్శలు గుప్పించారు నాగబాబు.  తెలుగు దేశం తండ్రి అయితే.. కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్.. అంటూ ఆరోపించారు.  వైసీపీ కూడా ఏం చేస్తారు వీళ్లు. ఇంకా నాలుగేళ్లు ఉంది. లాస్ట్ లో ఏదో ఒకటి చేసి నెగిటివిటీ తగ్గించుకోవచ్చులే అని ఆలోచిస్తున్నారని అన్నారు వెల్లడించారు నాగబాబు. మీకు చేతకాకపోతే మాకు అప్పజెప్పండి ఇసుక ఇబ్బందులు ఎలా తగ్గించాలో మేం చెబుతాం అని అన్నారు నాగబాబు.