నిండుకుండలా నాగార్జునసాగర్‌.. 22 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లోని 22 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 10:17 AM IST
నిండుకుండలా నాగార్జునసాగర్‌.. 22 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లోని 22 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. ప్రాజెక్టు నీటిమట్టం 884.90 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు 6 గేట్లను 17 అడుగుల చొప్పున ఎత్తి నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌ కు విడుదల చేశారు. 

నాగార్జునసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌లోని 22 గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి 3 లక్షల 77 వేల 300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఈ మొత్తంలో 2 లక్షల 94 వేల 300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

నాగార్జునసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 589 అడుగులకు పైగా నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 310 టీఎంసీకు పైగా నీరు ఉంది.

Also Read : కరెంట్ ఫుల్ : జల విద్యుత్ ఉత్పత్తిలో కొత్త రికార్డ్