తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నా

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 10:11 AM IST
తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నా

ఏపీలో పోలింగ్ ముగిసినా.. హీట్ మాత్రం తగ్గలేదు. తెనాలి డీఎస్పీ ఆఫీస్ ఎదుట మంత్రి నక్కా ఆనంద్ బాబు ధర్నాకు దిగారు. వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున టీడీపీ కార్యకర్తలను దుర్భాషలాడారంటూ నిరసన తెలిపారు. అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బూతుమల్లి పోలింగ్ దగ్గర ఏం జరిగిందో తెలియాలి అంటే.. విచారణ చేయాలని కోరుతున్నారాయన. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులు ధర్నాలో పాల్గొన్నారు.

వేమూరు ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మంత్రి నక్కా ఆనంద్ బాబు, వైసీపీ అభ్యర్థిగా మేరుగ నాగార్జునలు ఉన్నారు. టీడీపీ కంచుకోట అయిన బూతుమల్లి గ్రామానికి పోలింగ్ జరిగే సమయంలో మేరుగ నాగార్జున వచ్చారు. పోలింగ్ బూత్ లో హల్ చల్ చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు.  దీంతో టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులు నాగార్జున కారుపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడున్న ఆరుగురిని అరెస్టు చేశారు. 

ఈమేరకు మంత్రి నక్కా ఆనంద్ బాబు, మేరుగ నాగార్జున డీఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఆరెస్టు చేసిన ఆరుగురిని విడుదల చేయాలని పట్టుబట్టారు. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి, టీడీపీ మహిళా ఏజెంట్లను దుర్భాషలాడిన వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాలని, వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు మేరుగ నాగార్జున కేసును విత్ డ్రా చేసుకోలేదు.