అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 05:53 AM IST
అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే

నల్గొండ: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు ఏప్రిల్ 11 ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే వారు నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉండే పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు. 

నల్గొండ లోక్ సభ నియోజకవర్గం..ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ..ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళల ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధిక  సంఖ్యలో ఉన్నారు. దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం తప్ప..నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కొండడ్, సూర్యాపేట, నాగార్జున సాగర్ వంటి నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
Read Also: గుంటూరు జిల్లాలో 14సీట్లు ఖరారు: నారా లోకేష్ ఎంట్రీ.. రసవత్తరంగా రాజకీయం

లోక్ సభ నియోజకవర్గంలో మహిళలు 
నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న  మొత్తం లోక్ సభ నియోజకవర్గం మొత్తం నియోజకవర్గం 15,79,207 ఓటర్లు ఉండగా వారిలో 50.5 శాతం మహిళా ఓటర్లే ఉన్నారు. అంటే పురుష ఓటర్లు 7,81,444 మంది ఉంటే మహిళా ఓటర్లు 7,97,682 ఉన్నారు.

అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు 
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు 50.3 శాతం ఉండగా..నాగార్జున సాగర్ 50.3 శాతం మంది ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 50.6 శాతం,హుజుర్ నగర్ విభాగంలో 50.8 శాతం, కోదాడలో 50.9 శాతం మంది ఉన్నారు. అయితే..దేవరకొండలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే తక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో మొత్తం 2,34,544 మందిలో మహిళా ఓటర్లు 1,18,953 మంది ఓటర్లు ఉన్నారు.

నల్లగొండ లోక్ సభ నియోజకవర్గం మొత్తం ఓటర్లు  15,79,207 

  • మహిళా ఓటర్లు 79,7682
  • పురుష ఓటర్లు   78,1444
  • ఇతరులు 81 మంది ఉన్నారు

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు 
 

నియోజకవర్గం  మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు 
దేవరకొండ  2,34,544     1,18,553 1,15,973
నాగార్జున 2,16,512 1,07,391 1,09,113
మిర్యాలగూడ  2,18,924 1,08,099 1,10,812
హుజూర్ నగర్  2,34,381 1,15,205 1,19,166
కోదాడ 2,27,027 1,11,316 1,150701,
సూర్యాపేట  2,23,713 1,10,232 1,13,467
నల్లగొండ  2,24,106 1,10,648 1,13,450