ఎన్నికల కోడ్ ఒక్క APలోనే ఉందా? – లోకేష్ ట్వీట్

AP CM బాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లపై వివాదం రగులుతూనే ఉంది. దీనిపై ఈసీ ప్రశ్నించడంపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

  • Published By: madhu ,Published On : April 20, 2019 / 12:16 PM IST
ఎన్నికల కోడ్ ఒక్క APలోనే ఉందా? – లోకేష్ ట్వీట్

AP CM బాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లపై వివాదం రగులుతూనే ఉంది. దీనిపై ఈసీ ప్రశ్నించడంపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

AP CM బాబు నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లపై వివాదం రగులుతూనే ఉంది. దీనిపై ఈసీ ప్రశ్నించడంపై తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా కోడ్ ఉందని…అక్కడ ఎందుకు వర్తించదని ప్రశ్నిస్తున్నారు. దీనిపై బాబు కొడుకు నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఏప్రిల్ 20వ తేదీ శనివారం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారని వెల్లడించారు లోకేష్.
Also Read : పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారు : జీవీఎల్ క్వశ్చన్స్

కేసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోందని తెలిపారు. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం? అంటూ నిలదీశారు. ఎన్నికల కోడ్ ఒక్క APలోనే ఉందా? EC ఆంక్షలన్నీ ఒక్క TDPకే వర్తిస్తాయా? అంటూ తెలిపారు.

ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా? అంటూ ప్రశ్నించారు లోకేష్. మరి లోకేష్ చేసిన ఈ ట్వీట్‌పై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 
Also Read : టీడీపీ నేత సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య