స్కూల్స్ ఓపెన్ చేసిన ఫలితం : 9 వేల మందికి పైగా విద్యార్దులకు కరోనా

  • Published By: nagamani ,Published On : August 27, 2020 / 10:48 AM IST
స్కూల్స్ ఓపెన్ చేసిన ఫలితం : 9 వేల మందికి పైగా విద్యార్దులకు కరోనా

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచంలోని పలు దేశాల్లో విద్యాసంస్థలన్నీ మూతపడటంతో విద్యావ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. దీంతో ఇంకెన్నాళ్లు ఇలా స్కూల్స్ మూసి ఉంచాలి? కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూల్స్ రీఓపెన్ చేయాలని దాదాపు అన్ని దేశాలు త్వరపడుతున్నాయి. దీంట్లో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా రాష్ర్టంలో స్కూల్స్ రీఓపెన్ చేశారు. విద్యార్ధులు కూడా స్కూళ్లకు బాగానే వస్తున్నారు. దీని ఫలితంగా గత రెండు వారాలుగా కరోనా మరోసారి చెలరేగిపోయింది. మరోసారి తన ప్రతాపాన్ని చూపెట్టింది. ఫలితంగా ఏకంగా 9 వేల మంది పిల్లలు కరోనా దాని బారినపడ్డారు.



ఫ్లోరిడాలో రాష్ర్టంలో సోమవారం (ఆగస్టు24,2020) వరకు 18 ఏళ్లలోపు పిల్లల్లలో కరోనా కేసులు 39 వేల 800 ఉండగా..స్కూల్స్ రీఓపెన్ చేసిన తరువాత వాటి సంఖ్య 49 వేలకు చేరుకుంది. అంటే 9వేల 200ల కేసులు పెరిగాయి. అంటే దాదాపు 10వేల మంది పిల్లలకు కరోనా సోకింది. ఈ మొత్తం కేసుల్లో ఫ్లోరిడా డి పార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ ఇటీవల విడుదల చేసిన పీడియాట్రిక్ నివేదిక ప్రకారం..36 శాతం కేసులు 14 నుంచి 17 ఏళ్ల లోపు పిల్లల్లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న సంఖ్య కూడా పెరుగుతోందని, 650 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మనదేశంలో స్కూళ్లను ఇప్పుడు తెరిచే ప్రసక్తే లేదని కేంద్రం అంటోంది. అన్ లాక్ 4.0 లో భాగంగా స్కూళ్లను, థియేటర్లను, మెట్రో రైళ్లను తిరిగి ప్రారంభిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఆ నెలాఖరున 4.0 మార్గదర్శకాలు జారీ చేసే అవకాశముంది.
https://10tv.in/telangana-digital-classes-guidelines/
లాక్ డౌన్ వల్లా..తీసుకునే జాగ్రత్తల వల్లా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య కాస్త నెమ్మదించింది. కానీ..భారత్, అమెరికా ఇంకా కొన్ని దేశాల్లో మాత్రం కేసులు విచ్చల విడిగా పెరిగిపోతున్నాయి. అమెరికాలో కేసులు కొన్ని రాష్రాల్లో కేసులు తగ్గుతున్నా బయటికొస్తే మాత్రం వైరస్ లటుక్కున పట్టేసుకుంటోంది. ఈ క్రమంలో స్కూల్స్ రీఓపెన్ చేయటంతో ఫ్లోరిడాలో కరోనా వ్యాప్తి పెరిగినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.



మరి ఇటువంటి పరిస్ధితుల్లో భారత్ లో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్ చేయాలనే ప్రతిపాదలను వస్తున్నాయి. కానీ ప్రస్తుతం కరోనా సంఖ్య నానాటికీ పెరుగుతున్న పరిస్థితుల్లో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటంలేదని పలు సర్వేలు చెబుతున్నాయి. మరి సెప్టెంబర్ నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలనే నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.