కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్

కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్ నమోదైంది. కన్నెపల్లి పంప్ హౌజ్‌లో 11 మోటార్లు ఒకేసారి రన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోశారు అధికారులు.

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 01:46 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్

కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్ నమోదైంది. కన్నెపల్లి పంప్ హౌజ్‌లో 11 మోటార్లు ఒకేసారి రన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోశారు అధికారులు.

కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్ నమోదైంది. కన్నెపల్లి పంప్ హౌజ్‌లో 11 మోటార్లు ఒకేసారి రన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోశారు అధికారులు. మొన్నటి వరకు దశల వారీగా మోటార్లకు ట్రయల్ రన్ చేపట్టారు. మొదటిసారి నిర్వహించిన వెట్ రన్ సక్సెస్ అయింది. దీంతో ఇంజినీరింగ్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సాగునీటి సరఫరా, వ్యవసాయం రూపురేఖలను మార్చే బృహత్తర ప్రాజెక్టు ఫలాలు సంపూర్ణంగా అందేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది జూన్‌ 21న ప్రారంభించిన కాళేశ్వరం పథకం ద్వారా ఏడాదికి ఏకంగా 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసే శాశ్వత కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏటా సరాసరిన మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాల్లో వంద టీఎంసీలు కూడా వాడుకోవడం పెద్దసవాలు. 

మంచి వర్షాలు కురిసి.. అందునా మహారాష్ట్రలోని బాబ్లీ మీదుగా వరద వస్తే తప్ప శ్రీరాంసాగర్‌ ద్వారా ఆ నీటిని వాడుకోలేని పరిస్థితి. ఎస్సారెస్పీ ఒక్కసారి ఖాళీఅయితే మరుసటి ఏడాది వర్షాకాలం దాకా ఎదురుచూడాల్సిందే. ఇదంతా… కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు తెలంగాణ గోస. కానీ, కాళేశ్వర శకం మొదలయ్యాక 2019-20 నీటి సంవత్సరంలో దాదాపు 400 టీఎంసీల వరకు వినియోగం చేరింది. 2020-21 నీటి సంవత్సరంలో 530 టీఎంసీలు ఎత్తిపోసేలా శ్రీకారం చుట్టనున్నారు.