నిజామాబాద్ రైతుల ధర్నా: ‘గుర్తు’లు రాలేదు..ఎన్నికలు రద్దు చేయండి

  • Published By: veegamteam ,Published On : April 3, 2019 / 10:08 AM IST
నిజామాబాద్ రైతుల ధర్నా: ‘గుర్తు’లు రాలేదు..ఎన్నికలు రద్దు చేయండి

నిజామాబాద్ : ఈ లోక్ సభ ఎన్నికల క్రమంలో నిజామాబాద్ రైతులు వార్తల్లోకొచ్చారు. ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీకి దిగటం..నామినేషన్లు కూడా దాఖలు చేశారు నిజామాబాద్ పసుపు, ఎర్ర మొక్కజొన్నలు పండించే 185మంది రైతులు. ఈ క్రమంలో ఈరోజు (ఏప్రిల్ 3) వారంతా లోక్ సభ ఎన్నికలు 15 రోజుల పాటు  వాయిదా వేయాలని డిమాండ్ చేస్తు జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నా తమకు ఈసీ ఇంకా ఎన్నికల గుర్తులు కేటాయించలేదని అందుకే లోక్ సభ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తు ఆందోళన చేపట్టారు. పసుపు, ఎర్ర మొక్కజొన్న పంటలకు మద్దతు ధర దక్కకపోవడంపై నిరసనగా రైతన్నలు టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేస్తామంటు నామినేషన్లు వేసిన సంగతి తెలిసిందే.  
 

ఎన్నికల గడువు సమీపించినా ఇంకా తమకు గుర్తులు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పోలింగ్ అవగాహన కేంద్రం ముందు బైఠాయించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు రైతన్నలను సర్థి చెప్పేందుకు యత్నించారు. సమచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని..ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఎటువంటి ఆందోళనలు చేయకూడదని వారికి తెలిపారు. దీంతో రైతన్నలు ఆందోళనను విరమించారు.కాగా  ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా కాకుండా ఎం-3 రకం ఈవీఎం యంత్రాలను వినియోగిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.