ఛాన్స్ ఇస్తే ఇంట్లోనే : స్ట్రాంగ్ రూంలకు నా తాళం వేస్తా – ఈసీకి ధర్మపురి లేఖ

  • Published By: madhu ,Published On : April 15, 2019 / 10:58 AM IST
ఛాన్స్ ఇస్తే ఇంట్లోనే : స్ట్రాంగ్ రూంలకు నా తాళం వేస్తా – ఈసీకి ధర్మపురి లేఖ

నిజామాబాద్ BJP MP అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈవీఎంలు – వీవీ ప్యాట్‌లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు తన సొంత తాళం వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు. ఏప్రిల్ 15వ తేదీ రాష్ట్ర సీఈవో రజత్ కుమార్‌ను కలిసిన అరవింద్.. లేఖను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభకు ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

నిజామాబాద్ ఎన్నికలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారని అరవింద్ అభినందించారు. అయితే కొన్ని సందేహాలు ఉన్నాయి.. వాటిపై పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కు వివరించినట్లు చెప్పుకొచ్చారు. కొన్ని నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఆలస్యంగా స్ట్రాంగ్ రూంలకు తరలించారని ఆరోపించారు. రాత్రికి రాత్రి పోలింగ్ శాతం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. 
Read Also : 50% vvpats లెక్కింపుపై మళ్లీ కోర్టుకెళతాం : చంద్రబాబు

మరోవైపు స్ట్రాంగ్‌ రూంల్లో ఈవీఎం భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయన్నారు. తన నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు.. తన తాళాలు కూడా వేసుకోనివ్వాలని సీఈవోకు సమర్పించిన లేఖలో కోరారు. భద్రతపై తనకు నమ్మకం లేదన్నారు. సమాచార హక్కు చట్టం కింద నిజామాబాద్ పోలింగ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని RTIని కోరినట్లు ధర్మపురి అరవింద్ వెల్లడించారు. 

భారీ భద్రత నడుమ ఈవీఎంలు స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. మూడెంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఓట్ల లెక్కింపుకు చాలా రోజుల సమయం ఉండడంతో ఈవీఎంల భద్రతపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆయా పార్టీలు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి భద్రతను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజామాబాద్‌లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Read Also : టీడీపీ ప్రభుత్వమే పక్కా : మళ్లీ బాబే సీఎం – డొక్కా