పుట్టపర్తి పోస్టల్ బ్యాలెట్ : ఉద్యోగుల ఆందోళన

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 08:15 AM IST
పుట్టపర్తి పోస్టల్ బ్యాలెట్ : ఉద్యోగుల ఆందోళన

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే అనంతపురం జిల్లాలో పుట్టపర్తి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో గందరగోళం నెలకొంది. పుట్టపర్తి నియోజకవర్గంలో 6 మండలాలున్నాయి. ఈ మండలాల్లో మొత్తం 3850 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడ ఒకే పోస్టల్ బ్యాలెట్‌ కేంద్రాన్ని ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 05వ తేదీ శుక్రవారం ఈ కేంద్రానికి ఉద్యోగులు చేరుకున్నారు. ఒకే కేంద్రం ఏర్పాటు చేయడం..భారీగా ఉద్యోగులు ఉండడంతో ఇబ్బందులు పడ్డారు. కనీస సౌకర్యాలు అంటే ఫ్యాన్..మంచినీరు..ఇతరత్రా సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంటి పిల్లలతో వచ్చిన కొంతమంది పలు సమస్యలను ఎదుర్కొన్నారు. 
Read Also : పట్టుబడుతున్న కట్టలు : బంజారాహిల్స్ లో మూడున్నర కోట్లు

వెంటనే ఇక్కడున్న సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎంపీడీవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వారు వినిపించుకోలేదు. చివరకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసుల చర్యను వారు తీవ్రంగా ఖండించారు. 
మరోవైపు హిందూపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఓటింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులను ఎలా అనుమతినిస్తారంటూ వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులు వెదజల్లుతూ ప్రభావితం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధమైంది. ఈ తరుణంలో ఎన్నికల అధికారి రహస్యంగా పోస్టల్ బ్యాలెట్‌లు ముద్రించారు. వివిధ ప్రాంతాల్లో సర్వీస్ సెక్టార్‌లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జిల్లా ఎన్నిక కార్యాలయం నుండి పోస్టల్ బ్యాలెట్ పేపర్ పంపిణీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్లు పోలింగ్ తేదీ కన్నా ఒక రోజు ముందు వరకు గానీ..ఎన్నికల అధికారులు సూచించిన గడువులోగా అధికారులకు అందచేయాల్సి ఉంటుంది. 
Read Also : వికీలీక్స్ వ్యవస్థాపకుడు అరెస్ట్!