డెంగీ, మలేరియా వస్తున్నాయట : ఆ ఊరిలో మాంసం దుకాణాలు బంద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వింత చోటు చేసుకుంది. డెంగీ, మలేరియా రావడానికి మాంసాహారమే కారణమని అధికారులు తేల్చారు. ఆ వెంటనే మాంసాహార

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 04:11 PM IST
డెంగీ, మలేరియా వస్తున్నాయట : ఆ ఊరిలో మాంసం దుకాణాలు బంద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వింత చోటు చేసుకుంది. డెంగీ, మలేరియా రావడానికి మాంసాహారమే కారణమని అధికారులు తేల్చారు. ఆ వెంటనే మాంసాహార

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వింత చోటు చేసుకుంది. డెంగీ, మలేరియా రావడానికి మాంసాహారమే కారణమని అధికారులు తేల్చారు. ఆ వెంటనే మాంసాహార దుకాణాలను మూసేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో గతంలో ఎన్నడూ లేనంతగా వ్యాధులు విజృంభించాయి. జనాలు మంచం ఎక్కారు. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిపోయాయి. ఈ రేంజ్ లో రోగాలు రావడానికి, వ్యాప్తి చెందడానికి నాన్ వెజ్ కారణం అని అధికారులు నిర్ణయించారు. వెంటనే మటన్, చికెన్ షాపులను క్లోజ్ చేయించారు.

అక్టోబర్ 2వ తేదీ అంటే గాంధీ జయంతి వరకు మాంసం దుకాణాలు తెరవడానికి వీల్లేదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు రావడానికి మాంసాహారమే కారణం అని అధికారులు చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. అధికారుల తీరు చర్చకు దారితీసింది. నాన్ వెజ్ షాపుల వ్యాపారులు లబోదిబో మంటున్నారు. షాపులు మూసేస్తే తాము బతికేది ఎలా అంటున్నారు. ఇదెక్కడి చోద్యం అని విస్తుపోతున్నారు.