బాసర అమ్మవారి సన్నిథిలో ఆక్టోపస్ కమెండోలు

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 11:00 AM IST
బాసర అమ్మవారి సన్నిథిలో ఆక్టోపస్ కమెండోలు

నిర్మల్: బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో ఇవాళ ఆక్టోపస్ కమాండోలు రిహార్సల్ నిర్వహించారు. కాగా పలు సందర్బాలలో ఆయా ప్రదేశాలలో ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఏదైనా సందర్భాలలో ఆయా ప్రదేశాలలో చొరబడి ప్రజలను నిర్భందిస్తే అక్టోపస్ దళాలు రక్షించేందుకు రిహాల్సస్ చేస్తుంటారు. ఈ క్రమంలో తీవ్రవాదుల దాడి, ప్రతిఘటనపై కమాండోలు రిహార్సల్ నిర్వహించారు. ఒకవేళ ఆలయంపై దాడి జరిగితే.. ఉగ్రవాదులను ఎలా హతమార్చి ఆలయంలోని భక్తులు రక్షించాలి.. అన్నదానిపై ఆక్టోపస్ కమాండో టీమ్ ఆలయంలోని అన్ని వైపులా రిహార్సల్ నిర్వహించింది. 
 

ఇటువంటి అవగాహన కార్యక్రమంలో భాగంగా..ఫిబ్రవరి  19న హైదరాబాద్ అక్టోపస్ డీఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో 45 మంది కమెండోల బృందం భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం ఆఫీస్ కు ఇరువైపుల ఉన్న గేట్లు వేసి దిగ్భందనం చేశారు. ఆ సమయంలో కార్యాలయంలోనే అధికారులు, సిబ్బందితో పాటు పనుల నిమిత్తం వచ్చిన వివిధ సంఘాల కార్మిక నేతలు, కార్మికులు, సందర్శకులు పలువురు ఉన్నారు. ఎవరినీ బయటకు వెళ్లవద్దని ఆదేశించారు. తదనంతరం ఆపరేషన్ నిర్వహించి అధికారులను, సిబ్బందిని, కార్మిక నేతలు, కార్మికులను దఫాల వారీగా బయటకు పంపారు. ఈ మాక్ డ్రిల్‌లో టియర్‌గ్యాస్‌ను వినియోగించారు. బాంబుల శబ్ధ్దాలు కూడా పెద్దఎత్తున వినిపించాయి. ఇలా సాయంత్రం 7 గంటల వరకు మాక్ డ్రిల్ నిర్వహించారు.