విద్యార్ధినిలను వేధిస్తున్నటీచర్ పై చర్యలు తీసుకోరా : నివేదిక ఇచ్చినా స్పందించని అధికారులు 

  • Edited By: veegamteam , November 14, 2019 / 05:01 AM IST
విద్యార్ధినిలను వేధిస్తున్నటీచర్ పై చర్యలు తీసుకోరా : నివేదిక ఇచ్చినా స్పందించని అధికారులు 

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వేణుగోపాలపురంలో టీచర్ టీచర్ అకృత్యాలకు పాల్పడుతున్నాడు. సంవత్సం కాలంనుంచి ఓ టీచర్ విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారులకు వివరించినా ఎటువంటి ఫలితం లేదు. దీంతో ఆ కీచక టీచర్ మరింతగా రెచ్చిపోయాడు. విద్యార్దినులకు నరకం చూపిస్తున్నాడు. 

గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్న చంద్రశేఖర్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్దినులపై గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. సంవత్సరం కాలంగా చంద్రశేఖర్ అకృత్యాలు కొనసాగుతున్నాయి. చంద్రశేఖర్ విద్యార్దినులపై వేధింపులకు పాల్పడుతున్నాడనే విషయాన్ని దృవీకరించి  డీఈవోకు ఎంఈవో నివేదికలు కూడా పంపించారు. కానీ ఇప్పటి వరకూ చంద్రశేఖర్ పై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 

 డీఈవోకు ఎంఈవో నివేదికలు పంపించి 10 రోజులు గడిచింది. కానీ ఇప్పటి వరకూ సదరు కీచక టీచర్ పై చర్యలను ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. దీనిపై విద్యార్దినిలతో పాటు వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికపై ఇటువంటి దారుణాలకు పాల్పడేవారిని ఇలాగే వదిలేస్తే..వారి అరాచకాలకు ఇంకా ఎంతమంది గురికావాలి అని ప్రశ్నిస్తున్నారు.