ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి వృద్ధుడు మృతి

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో సబ్సిడీ ఉల్లి కో్సం వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందాడు.

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 08:18 AM IST
ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి వృద్ధుడు మృతి

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. కృష్ణా జిల్లాలో సబ్సిడీ ఉల్లి కో్సం వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందాడు.

దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు క్యూలు కడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉంటే తప్ప సబ్సిడీ ఉల్లి దొరకని పరిస్థితి దాపురించింది. కృష్ణా జిల్లాలో సబ్సిడీ ఉల్లి కోసం వెళ్లి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఉల్లిపాయలను సబ్బిడీ కింద ప్రజలకు అందిస్తోంది. దీంట్లో భాగంగానే గుడివాడ రైతు బజార్ లో సబ్బిడీ ఉల్లిపాయలను పంపిణీ చేస్తో్ంది. దీంతో సాంబయ్య అనే వృద్ధుడు సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజారుకు వెళ్లాడు.

గంటన్నసేపు క్యూలైన్‌లోనే నిల్చున్న సాంబయ్య నీరసించి కుప్పకూలిపోయాడు. స్థానికులు చికిత్స కోసం వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. 

ప్రస్తుతం ఉల్లి బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.120కి పైగా పలుకుతుండడంతో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లిని రూ.25కే రైతు బజారాల్లో అందిస్తోంది. దీంతో రైతు బజార్ల దగ్గర ప్రజలు క్యూ కడుతున్నారు. సబ్బిడీ ఉల్లి కోసం భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. దీంతో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి.