జస్ట్ 4గంటల్లో 5వేల కిలోలు అమ్మకం : వామ్మో ఉల్లి

తిరుపతిలో ఉల్లి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జస్ట్ 4 గంటల్లో 5 టన్నుల(5వేల కిలోలు) ఉల్లిపాయలు అమ్ముడుపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో ఉల్లి అమ్ముడుపోవడం

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 11:44 AM IST
జస్ట్ 4గంటల్లో 5వేల కిలోలు అమ్మకం : వామ్మో ఉల్లి

తిరుపతిలో ఉల్లి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జస్ట్ 4 గంటల్లో 5 టన్నుల(5వేల కిలోలు) ఉల్లిపాయలు అమ్ముడుపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో ఉల్లి అమ్ముడుపోవడం

తిరుపతిలో ఉల్లి అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. జస్ట్ 4 గంటల్లో 5 టన్నుల(5వేల కిలోలు) ఉల్లిపాయలు అమ్ముడుపోయాయి. కనీవిని ఎరుగని రీతిలో ఉల్లి అమ్ముడుపోవడం చూసి అధికారులు షాక్ తిన్నారు. ఉల్లికి ఉన్న డిమాండ్ చూసి వారి నోట మాట రాలేదు. కాగా సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజార్లకు జనం క్యూ కట్టారు. 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉంటున్నాయి. 

తెల్లవారుజాము నుంచే జనాలు.. రైతు బజార్లకు వస్తున్నారు. యువకులు, మహిళలు, పురుషులు, వృద్ధులు క్యూలైన్ లో నిల్చుంటున్నారు. ఏపీ ప్రభుత్వం సబ్సిడీ కింద కిలో ఉల్లిని రూ.25కే ఇస్తున్న సంగతి తెలిసిందే. రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.150పైనే ఉంది. డబుల్ సెంచరీ దిశగా ఉల్లి ధరలు పయనిస్తున్నాయి. దీంతో సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు క్యూ కడుతున్నారు.

కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది. రోజు రోజుకూ మరింత షాక్ ఇస్తూ.. ఉల్లి ధరలు ఆకాశాన్ని దాటి అంతరిక్షాన్నంటుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.150 పైనే పలుకుతోంది. అతి త్వరలో రూ.200లకు చేరువయ్యేలా పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉల్లి ధర రికార్డు స్థాయిలో రూ.150 దాటి రూ.160, రూ.170 వరకు చేరుకుంది. ఉల్లి ధరల పెరుగుదలపై అన్ని వర్గాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఉల్లిగడ్డ నిల్వ అయిపోతుందనగానే.. మధ్య తరగతి, పేద ప్రజల గుండెలు జారిపోతున్నాయి. ఏ కూర వండాలన్నా ముందు కావాల్సింది ఉల్లి.. మరి అదే లేకపోతే ఏం తినాలని నిట్టూరుస్తున్నారు.