పంచాయతీ సమరం : సిరిసిల్లలో ప్రశాంతంగా పోలింగ్

  • Published By: madhu ,Published On : January 25, 2019 / 09:09 AM IST
పంచాయతీ సమరం : సిరిసిల్లలో ప్రశాంతంగా పోలింగ్

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గములో గ్రామపంచాయతి ఎన్నికల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా అధికార  యంత్రాంగం అన్నీ చర్యలు  చేపట్టగా, అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ కూడా పలు భద్రతా చర్యలు చేపట్టింది. నియోజక వర్గములోని ముస్తాబాద్, గంబీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్ణపల్లి మండలాల పరిదిలోని 84 గ్రామ పంచాయతీలకు గాను 16 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా 68 గ్రామ పంచాయతీలకు, 744 వార్డులకు గాను 236 వార్డులు ఏకగ్రీవం కాగా, 508 వార్డులకు సభ్యులను ఎన్నుకునేందుకు  ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మొదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. 
ప్రశాంతంగా ఎన్నికలు : ఇన్‌ఛార్జీ కలెక్టర్
గ్రామాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఈ సందర్బముగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జె.సి. షేఖ్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ…జిల్లాలో రెండవ విడత ఎన్నికలు చాలా ప్రశాంతముగా జరిగాయని వెల్లడించారు. మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఎన్నిక కాబడిన  సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌ని రిటర్నింగ్ అధికారి సమక్షములో ఎన్నుకుంటారన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికలు, ఓట్ల లెక్కింపు విషయములో ప్రత్యేక శిక్షణను ఇచ్చామని స్పష్టం చేశారు. జిల్లాలో సుమారు 80 శాతం వరకు ప్రజలు తమ ఓటును వినియోగించుకున్నారు