తమ్ముళ్ల తగాదా : టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో కొట్టుకున్న కార్యకర్తలు

నల్లగొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం రసాభాసగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 12:42 PM IST
తమ్ముళ్ల తగాదా : టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో కొట్టుకున్న కార్యకర్తలు

నల్లగొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం రసాభాసగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో కార్యకర్తలు కొట్టుకున్నారు.

తెలంగాణ టీడీపీలో ముసలం మొదలైంది. నల్లగొండలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం రసాభాసగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. జిల్లా టీడీపీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు గొడవ పడ్డారు. ఒకరిపైమరొకరు దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన నేతలు రావడంపై మరో వర్గం అభ్యంతరం తెలిపింది. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. అది కొట్టుకునే వరకు వెళ్లింది. 

చాలా కాలం తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ ఇంచార్జ్ లు అందరూ కూడా మూకుమ్మడిగా టీడీపీని వీడి, బీజేపీలో చేరారు. ఆ తర్వాత జరుగుతున్న కీలక సమావేశంగా మొదటి నుంచి భావించారు. ఈ సమావేశానికి సంబంధించి ద్వితీయ శ్రేణి క్యాడర్ లో కేవలం ఒక వర్గానికి మాత్రమే సమాచారం ఇచ్చారు.. మిగతా వారికి ఇవ్వలేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఆరోపణలు వచ్చిన క్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పార్టీ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీకి సహకరించారని వాగ్వాదం మొదలైంది. గొడవ ప్రారంభమైన తర్వాత ఇతర నియోజకవర్గాల్లో మీ వల్లనే పార్టీ నాశనశమైందంటే.. మీవల్లనే నాశనమైందంటూ… ఇరు వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీడీపీకి గట్టి క్యాడర్ ఉంది. గ్రామాలతోపాటు సంస్థాగతంగా బలమైన క్యాడర్ ఉంది. కానీ పార్టీకి ఎటువంటి పదువులు లేకున్నా… కొన్ని చోట్ల జెడ్ పీటీసీ, ఎంపీటీసీలు గెలిచే అవకాశం ఉన్నా.. కొంతమంది నాయకుల వల్లే ఓడిపోయిందని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది.

Also Read : పోలీసు థర్డ్ డిగ్రీ : యువకుడిని తాళ్లతో కట్టేసి కర్రలతో చావబాదారు