ముఖ్య గమనిక : ఏప్రిల్ 1, 2 తేదీల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు

ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రవాణా కోసం (ట్రాఫిక్‌ బ్లాక్‌)

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 03:36 AM IST
ముఖ్య గమనిక : ఏప్రిల్ 1, 2 తేదీల్లో ప్యాసింజర్ రైళ్లు రద్దు

ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రవాణా కోసం (ట్రాఫిక్‌ బ్లాక్‌)

ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఏప్రిల్‌ 1, 2వ తేదీల్లో పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-కొండపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గూడ్స్‌ రవాణా కోసం (ట్రాఫిక్‌ బ్లాక్‌) పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు కాజీపేట రైల్వేస్టేషన్‌కు సమాచారం ఇచ్చారు.

* విజయవాడ నుంచి కాజీపేటకు నడిచే ప్యాసింజర్ (57238)ను ఏప్రిల్‌ 1న, కాజీపేట నుంచి విజయవాడకు నడిచే ప్యాసింజర్ (57237)ను 2న రద్దు.
* కాగజ్‌నగర్‌-కాజీపేట మధ్య నడిచే ప్యాసింజర్ (67204)ను ఏప్రిల్‌ 1న రద్దు.
* భద్రాచలం రోడ్‌-సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మధ్య నడిచే సింగరేణి ప్యాసింజర్ (67203) 1న డోర్నకల్‌ వరకు మాత్రమే పాక్షికంగా నడుస్తుంది.
* బల్లార్షా నుంచి భద్రాచలం రోడ్‌ వెళ్లే సింగరేణి ప్యాసింజర్ (67202) ఏప్రిల్‌ 1న వరంగల్‌ వరకు మాత్రమే నడుస్తుంది.
* సికింద్రాబాద్‌-గుంటూరు మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ (17202) సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 1గంటకు బయల్దేరాల్సి ఉండగా 3 గంటలకు బయల్దేరుతుంది.
* ఏప్రిల్‌ 1న తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (17405) గంట 45 నిమిషాలు, నర్సాపూర్‌-షిర్డీ సాయినగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17213) గంట 15 నిమిషాలు, విశాఖ-నిజాముద్దీన్‌ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ (12803) గంట 20 నిమిషాలు, విశాఖపట్నం-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (22415) 50 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి. 
Read Also : Check It : ఏప్రిల్ 11న సెలవు