O పాజిటివ్ కు బదులు B పాజిటివ్ ఎక్కించారు : రూ. 5కోట్లు చెల్లించాలని బర్డ్ ఆసుపత్రికి పేషెంట్ లీగల్ నోటీసులు

టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 09:12 AM IST
O పాజిటివ్ కు బదులు B పాజిటివ్ ఎక్కించారు : రూ. 5కోట్లు చెల్లించాలని బర్డ్ ఆసుపత్రికి పేషెంట్ లీగల్ నోటీసులు

టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు.

టీటీడీకీ చెందిన బర్డ్ ఆస్పత్రికి.. రామయ్య అనే పేషెంట్ లీగల్ నోటీసు పంపారు. డాక్టర్ల నిర్వాకంతో.. తనకు జరిగిన నష్టానికి రూ.5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని అందులో తెలిపారు. మ్యాటర్ లోకి వెళితే.. మోకాళ్ల ఆపరేషన్ కోసం.. రామయ్య కొన్నాళ్ల క్రితం బర్డ్ ఆస్పత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా.. ఆయనకు ఓ పాజిటివ్‌కు బదులు బీ పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించారు. దీంతో.. పేషెంట్ రామయ్య మరింత అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే.. రామయ్యని స్విమ్స్‌కు తరలించి.. బర్డ్ ఆస్పత్రి వైద్యులు రహస్యంగా చికిత్స అందించారు.

బాధితుడు రామయ్య కృష్ణా జిల్లా సత్యాలపాడు వాసి. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఇంటికే పరిమితమయ్యాడు. తనకు జరిగిన నష్టానికి.. రూ.5 కోట్లు పరిహారం చెల్లించాలని.. బర్డ్ ఆస్పత్రికి రామయ్య నోటీసు పంపారు. దీంతో.. డాక్టర్ల నిర్వాకం బయటపడింది. 

డాక్టర్లను దేవుడిలా చూస్తారు. ఆ దేవుడు ప్రాణాలు పోస్తే.. ఈ డాక్టర్లు ప్రాణాలు నిలుపుతారు. అయితే కొందరు వైద్యుల కారణంగా పవిత్రమైన డాక్టర్ వృత్తికి కళంకం వస్తోంది. నిర్లక్ష్యంతో పేషెంట్ల ప్రాణాలు తీస్తున్నారు. బర్డ్ ఆసుపత్రిలో అలాంటి ఘటనే జరిగింది. టీటీడీ నిధులతో నడుస్తున్న బర్డ్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ రోగి జీవితం అంధకారంగా మారింది. వైద్య చికిత్సకు వెళ్లిన తనకి O పాజిటివ్ రక్తంకి బదులు B పాజిటివ్ రక్తాన్ని ఎక్కించినట్టు రామయ్య ఆరోపణలు చేశారు. దీంతో తన ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు కిడ్నీలు దెబ్బతిన్నాయని తెలిపారు. 

తన వైద్య చికిత్స వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా రామయ్య కోరారు. ఆ వివరాలు ఇవ్వలేమని, తమ ఆసుపత్రి ఆర్టీఐ పరిధిలోకి రాదని డాక్టర్లు చెప్పి పంపేశారు. దీంతో బాధితుడు రామయ్య ఆసుపత్రిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇతర పేషెంట్లు వర్రీ అవుతున్నారు.