కర్నూలు బాలిక మర్డర్ కేసులో న్యాయం ఎక్కడ : పవన్ కళ్యాణ్

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 05:30 AM IST
కర్నూలు బాలిక మర్డర్ కేసులో న్యాయం ఎక్కడ : పవన్ కళ్యాణ్

సుగాలీ ప్రీత్. ఈ పేరు ప్రస్తుతం మరోసారి వెలుగులోకి వచ్చింది. నేషనల్ గా ట్రెడింగ్ లో ఉంది.  2017 ఆగస్టు 19న 15 సంవత్సరాల బాలిక మృతి జనసేన అధినేత పవన్ కళ్యాన్ నోటి వెంట రావటంతో మరోసారి వెలుగులోకి వచ్చింది.  కాగా..అత్యాచారాలకు..హత్యాచారాలకు బలైపోయిన బాధితుల పేర్లు బైటకు రాకూడదనే కారణంతో ప్రస్తుతం సుగాలీ ప్రీత్ పేరును గీతగా మార్చినట్లుగా సమాచారం. 

ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయిందని గీత చదివిన స్కూల్ యాజమాన్యం..కాదు..తమ బిడ్డ గీతను  స్కూల్ అధినేత కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు అత్యాచారం చేసి తరువాత చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. రెండు సంవత్సరాల క్రితం అంటే 2017లో జరిగిన ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ నోటివెంట వచ్చింది. చదువుకోవటానికి వెళ్లిన బాలిక గీతను దారుణంగా చంపేశారనీ కానీ ఇప్పటి వరకూ ఈ కేసు విషయంలో న్యాయం జరగలేదని అన్నారు. దారుణ పరిస్థితుల్లో బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రులు సుగాలీ రాజు నాయక్, పార్వతీ దేవిలు అప్పటి నుంచి పోరాడుతునే ఉన్నారనీ..వారి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 

ఎవరీ గీత.. 
కర్నూలుకు చెందిన 15 ఏళ్ల బాలిక. కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో చదివింది. 2017 ఆగస్ట్ 19న ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించింది. కానీ స్కూల్ యాజమన్యం అధినేత కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డిలు అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. బాలికపై అత్యాచారం జరిగిందని పోస్టుమార్టం చేసిన డాక్టర్స్ కూడా నిర్ధారించారు. ఈ కేసు విషయంలో కలెక్టర్ వేసిన కమిటీ కూడా గీతపై లైంగికదాడి చేసి తరువాత హత్య చేసినట్లుగా ధ్రువీకరించిందరి తల్లిదండ్రులు తెలిపారు. 

ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులు అరెస్ట్ అవ్వటం..వారికి 23 రోజుల్లో బెయిల్ కూడా వచ్చింది. ఆ తర్వాత కేసు నిర్వీర్యం అయిపోయింది. దీనికి కారణం స్కూల్ యాజమన్యం ఓ పార్టీకి చెందిన నేత కావటం కావటమేననే వార్తలు వినిపించాయి. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు ఎన్‌హెచ్ఆర్సీని ఆశ్రయించారు. ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. కానీ ఈనాటికీ ఈ కేసు ఓ కొలిక్కిరాలేదు. కొనసాగుతునే ఉంది. ప్రముఖ రాజకీయ నేతల పాత్ర ఉన్న ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దిశ హత్యాచారం మీద స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తడంతో మరోసారి 2017లో జరిగిన ఈ కేసు తెరపైకి వచ్చింది.