దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

దొడ్డిదారిన కాదు.. రాయల్‌గా తీసుకొచ్చా : నాగబాబు ఎంట్రీపై పవన్

దొడ్డిదారిన కాదు రాయల్‌గా రాజకీయాల్లోకి తన అన్న నాగబాబును తీసుకుని వచ్చానంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబును జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనకు నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తనకున్న రాజకీయ చైతన్యం నాగబాబు వల్లే ఏర్పడిందంటూ పవన్ వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని అన్నారు. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని, ఆయనకు రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉందని పవన్ అన్నారు. అందుకే నరసాపురం లోక్ సభకు నిలబెడతున్నట్లు ప్రకటించారు.
Read Also :హోటల్ బిల్లు కట్టని ప్రముఖ నటి: రూ.3.5లక్షలు పెండింగ్

అన్నింటిని వదులుకుని తన పిలుపు మేరకు అన్న నాగబాబు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు.. తమ్ముడుని తమ్ముడిగానే చూడాలి తన పార్టీ కార్యకలాపాల్లో తల దూర్చకుండా నాయకుడిగా తనని చూడాలని అనుకున్నానని, పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుండి పులిలా ఉండేవాడని, తమ్ముడు అంటే నాకు ఎప్పుడూ నాయకుడే అని నాగబాబు అన్నారు.

తనకు రాజకీయాల్లోకి రావాలని చాలా రోజుల నుంచి ఉందన్నారు. ప్రజారాజ్యంలో అవకాశం రాలేదన్నారు.జనసేన పార్టీలో చేరకముందే.. నా నాయకుడు పవన్ కళ్యాణ్ అని అనుకున్నానన్నారు. జనసేన ఆఫీస్‌లో చిన్న అవకాశం వచ్చినా పని చేయాలి అనే కమిట్‌మెంట్‌తో ఉన్నానని చెప్పారు. తనకు ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు హ్యాపీగా ఉందన్నారు నాగబాబు. నరసాపురం ఎంపీ సీటుకు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. తమ్ముడి నుంచి పార్టీ సభ్యత్వం స్వీకరించారు అన్నయ్య.
Read Also :మా ఫ్యామిలీలో చంపుకునేంత గొడవలు లేవు : వివేకా కుమార్తె సునీత

×