వివాదాస్పద స్వాగతం..విమానం దిగి మనుషులపై నడిచిన చైనా రాయబారి

  • Published By: nagamani ,Published On : August 19, 2020 / 01:29 PM IST
వివాదాస్పద స్వాగతం..విమానం దిగి మనుషులపై నడిచిన చైనా రాయబారి

విదేశస్తులు తమ దేశం వస్తే వారి సంప్రదాయంలో స్వాగతం పలకటం సర్వసాధారణం. కానీ ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇటువంటి మానవత్వం లేని స్వాగతాలు ఉంటాయా అనిపిస్తోంది. సంప్రదాయం పేరుతో ఏకంగా ఓ మనిషి సాటి మనుషుల మీద నడిచి వెళ్లే సంప్రదాయపు స్వాగతం వివాదంగా మారింది. ఈ ఘటనకు వేదిక కిరిబాటి ద్వీపంలో చోటుచేసుకుంది.



కిరిబాటి ద్వీపానికి చైనా రాయబారి టాంగ్ సాంగ్జెన్ తైవాన్ నుంచి కిరిబాటి ద్వీపానికి వచ్చారు. అతనికి విమానాశ్రమంలో ఘన స్వాగతం పలకాలని కిరిబాటి ద్వీప ప్రభుత్వం భావించింది. దాని కోసం విమానం దిగి వస్తున్న దారిలో పలువురు యువకులను పడుకోబెట్టి ఆ చైనా రాయబారిని వారిపై నడిపించారు.



టాంగ్ విమానం దిగిన తర్వాత దారిపొడవునా బోర్లా పడుకున్న యువకుల వీపుల పైనుంచి ఆయన నడిచివెళ్లారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఇద్దరు యువతులు టాంగ్ చేతులు పట్టుకుని ముందుకు నడిపించారు.



ఆగస్టు 16న ఈ ఫోటో సోషల్ మీడియాలోకి రావటంతో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజుల్లో కూడా ఇటువంటి అనాగరిక స్వాగతాలేంటీ అని కిరిబాటి ద్వీప సంప్రదాయం అయితే మాత్రం టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా రాయబారి సాటి మనుషులపై నడిచి వెళ్లమేంటీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేనా వారి సంస్కారం అంటూ మండిపడుతున్నారు.



ఇటువంటి విమర్శలపై స్పదించిన కిరిబాటి ప్రభుత్వం.. ఇందులో తప్పేం లేదనీ..గెస్టులను ఇలా ఆహ్వానించడం తమ సంప్రదాయంలో భాగమని తెలిపింది. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటేంటంటే..కిరిబాటి దేశ ప్రజల కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.