నాగర్ కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూరం గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. రైస్ మిల్లులో వరి ధాన్యం పట్టించగా ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఓ రైతు

  • Published By: veegamteam ,Published On : April 29, 2019 / 12:13 PM IST
నాగర్ కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూరం గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. రైస్ మిల్లులో వరి ధాన్యం పట్టించగా ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఓ రైతు

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపూరం గ్రామంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. రైస్ మిల్లులో వరి ధాన్యం పట్టించగా ప్లాస్టిక్ బియ్యం కలిశాయని ఓ రైతు ఆరోపించాడు. ఈ ఆరోపణలను మిల్లు యజమాని తోసిపుచ్చాడు. తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. అసలు ప్లాస్టిక్ బియ్యం ఎలా కలిశాయో తనకు తెలియదని చెప్పాడు. రామాపురం గ్రామంలో ఉన్న రైస్ మిల్లులో ప్లాస్టిక్ బియ్యం గింజలు దర్శనం ఇవ్వడం స్థానికంగా కలకలం రేపింది. తాము మోసపోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొందరు రైతులు 2 నెలల క్రితం వరి పండించారు. ఆ ధాన్యాన్ని బియ్యంగా పట్టించుకోవడానికి మిల్లుకి వచ్చారు. మిల్లులో బియ్యం పట్టించి సంచుల్లో నింపారు. ఆ బియ్యం తిన్న తర్వాత కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి అనుమానం వచ్చి మిల్లు దగ్గరికి వెళ్లి చూశారు. అక్కడ ప్లాస్టిక్ బియ్యం గింజలు కనిపించి షాక్ తిన్నారు. వెంటనే రైస్ మిల్లు యజమానిని నిలదీశారు. ఆయనేమో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. 2 నెలలుగా మిల్లులో పెద్ద ఎత్తున ఇలా జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని వాపోయారు. కొందరు అక్రమార్కులు డబ్బు ఆశతో ప్లాస్టిక్ బియ్యం గింజలు కొనుగోలు వాటిని బియ్యంలో కలిపేసి అమ్ముతున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.