అయోధ్యలో పారిజాత మొక్క నాటిన ప్రధాని మోడీ

  • Published By: nagamani ,Published On : August 5, 2020 / 01:57 PM IST
అయోధ్యలో పారిజాత మొక్క నాటిన ప్రధాని మోడీ

రామ మందిర నిర్మాణం కోసం అయోధ్య చేరుకున్న ప్రధాని సుమధుర పరిమళాలు వెదజల్లే ‘పారిజాత’ మొక్కను నాటారు.
ప్రత్యేక హెలికాఫ్టర్‌లో అయోధ్యకు వచ్చిన ప్రధానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఘన స్వాగతం పలికారు. అయోధ్య చేరుకున్న ప్రధాని ముందుగా హనుమాన్‌గఢీ ఆలయంలో ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకున్న మోడీకి ఆలయ నిర్వాహకులు ఆయనకు వెండి కిరీటం బహుకరించి స్వాగతం పలికారు. అనతరం ప్రధాని శ్రీరాముడికి పరమ భక్తుడైన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజల అనంతరం ఆ తర్వాత పారిజాత మొక్కను నాటారు.



ఆ తర్వాత రామ్‌లల్లా ఆలయానికి చేరుకున్న పూజలు చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ఆయన స్వామి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. రామ్‌లల్లా విగ్రహమూర్తి చుట్టూ మోదీ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఆయన శ్రీరాముడికి పువ్వులతో పూజ చేశారు. అక్కడి నుంచి రామాలయ నిర్మాణం భూమిపూజలో పాల్గొన్నారు. ప్రదానితో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



సుమధుర పరిమళాలు వెదజల్లే పారిజాత పువ్వులు తెల్లగా ఉండి మధ్యలో ఎరుపు రంగు ఉంటాయి. ఈ పారిజాతల్లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. పారిజాత పువ్వులు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనలో ఉండేఒత్తిడిని దూరం చేసి ప్రశాంతతను కలిస్తాయి. ఆయుర్వేదంలో పారిజాతానికి ప్రత్యేక స్థానం ఉంది. పారిజాతం అని లేదా రాత్రి పుష్పించే మల్లిక అను కూడా పిలుస్తారు. భారత పురాణాల్లో పారిజాతం మొక్క ఓ మహత్తు కలిగిన మొక్కగా కథనాలు ఉన్నాయి. పారిజాత మొక్క స్వర్గంలో వేదేవంద్రుడి ఉద్యానవనంలో ఉండేదని దాన్ని శ్రీకృష్ణుడు భూమిమీదకు తీసుకువచ్చాడని పురణకథనాలు చెబుతున్నాయి.