సీఎం కేసీఆర్ పథకాలు ప్రధాని మోడీని భయపెడుతున్నాయి : మంత్రి జగదీశ్ రెడ్డి

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 11:18 AM IST
సీఎం కేసీఆర్ పథకాలు ప్రధాని మోడీని భయపెడుతున్నాయి : మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రధాని నరేంద్రమోడీని భయపెతున్నాయని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.సూర్యాపేట గాంధీపార్క్‌లో మున్సిపల్‌ సంఘం చైర్మన్‌ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చారని పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి యావత్ భారతదేశం చర్చించుకుంటోంది. దీంతో మోడీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. 

15 సంవత్సరాల పాటు గుజరాత్ సీఎంగా పాలించిన నరేంద్రమోడీ కేసీఆర్ పాలనలో అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న తెలంగాణ గురించి యోచిస్తున్నారన్నారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన కేవలం మూడు సంవత్సరాలకే సీఎం కేసీార్  రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించగలినప్పుడు ఆరేళ్లు ప్రధానిగా 15 ఏళ్లు గుజరాత్ సీఎంగా పనిచేసిన మోడీ  గుజరాత్‌ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. 

గుజరాత్ సీఎంగా మోడీ ఉన్న సమయంలో 24 గంటలు కరెంట్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.  కళ్యాణ్ లక్ష్మీ..మెడికల్ విభాగంగా తెలంగాణ సీఎం ఇస్తున్న కేసీఆర్ కిట్ వంటి పథకాలను ఎందుకు రూపకల్పన చేయలేదు? అని ప్రశ్నించారు. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని మోడీ భయపడుతున్నారనీ..అందుకే కేసీఆర్ పై మోడీ పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఇవ్వటమే అన్యాయం అన్నట్లుగా మోడీ..సందర్భం లేకుండా  పార్లమెంట్ లో మాట్లాడటం దీనికి నిదర్శనమనీ మంత్రి జగదీశ్ విమర్శించారు. పార్లమెంట్ తలుపులు బిగించి తెలంగాణ బిల్లును పాస్ చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని..తెలంగాణ ఏర్పడకపోతే కేసీఆర్‌ సీఎం అయిఉండేవారనీ మోడీ వ్యాఖ్యానించటంపై మంత్రి జగదీశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.