ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాకిస్థాన్ సోదరి..25ఏళ్లనుంచీ కొనసాగుతున్న సంప్రదాయం

  • Published By: nagamani ,Published On : July 31, 2020 / 08:55 AM IST
ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాకిస్థాన్ సోదరి..25ఏళ్లనుంచీ కొనసాగుతున్న సంప్రదాయం

ప్రధాని మోడీకి పాకిస్థాన్ మహిళ రాఖీ పంపించారు. మోడీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తూ రక్షాబంధన్ ను పంపించారు. గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా మోదీకి రాఖీ పంపుతున్న మోడీ పాకిస్థాన్ సోదరి కమర్ మొహిసిన్ షేక్ ఈ సంవత్సరం కూడా రాఖీ పంపారు. భారత్ ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో అభిమానామనీ..గౌరవమనీ..తనతోపాటు తన భర్త, కొడుకు కూడా మోడీని ఎంతగానో అభిమానిస్తారని ఈ సందర్భంగా కమర్ తెలిపారు.మోడీ ఎప్పటికీ ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం జీవించాలని ప్రార్థిస్తూ ఈ రాఖీ పంపించానని కమర్ తెలిపారు.



ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్‌పై మోదీ తీసుకున్న చర్యను కమర్ ప్రశంసించారు. మోడీ తప్ప మరెవరూ ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని ఆమె ప్రశంసించారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన మోడీ వచ్చే ఐదేళ్లు ఆయనకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానని..మోడీ చాలా సాధారణంగా కనిపించినా పనులు మాత్రం గొప్పగా చేస్తారని కితాబునిచ్చారు. మోడీ నుంచి పిలుపు వస్తే తాను తప్పకుండా ఢిల్లీ వెళ్తానని..తన ఇద్దరు చెల్లెళ్లు కూడా మోదీకి రాఖీ కట్టాలని కోరుకుంటున్నారని కమర్ తెలిపారు.