మరో చరిత్ర : గిన్నీస్ బుక్‌లో పోలవరం

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 12:54 AM IST
మరో చరిత్ర : గిన్నీస్ బుక్‌లో పోలవరం

తూర్పుగోదావరి : పోలవరంలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఏకధాటిగా కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. 22 గంటల్లో 29, 664 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేసి.. దుబాయ్‌ పేరున ఉన్న రికార్డును అధిగమించింది. ఈ పనుల్లో 3,600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పనులు దగ్గరుండి పర్యవేక్షించారు. కాంక్రీట్‌ పనుల్లో గిన్నిస్‌ రికార్డ్‌ సాధించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 
ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ చానల్లో 2019, జనవరి 06 ఉదయం ఏడు గంటల నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులు జనవరి 07 ఉదయం ఏడు గంటల వరకు కొనసాగనున్నాయి. కాంక్రీటు పనులు నిర్విరామంగా కొనసాగించి గిన్నీస్ రికార్డ్ సృష్టించబోతోంది. 24 గంటల్లో దాదాపు 28 నుంచి 30 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు నింపనుంది. 
22 గంటల్లో 29, 664 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు 
ఇప్పటివరకు 22 వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా కాంక్రీట్‌ పనులు పూర్తి 
దుబాయ్‌ కాంక్రీట్‌ పనుల నిర్మాణాన్ని అధిగమించి గిన్నిస్‌ రికార్డ్‌
నిన్న ఉదయం నుంచి కొనసాగుతున్న కాంక్రీట్‌ పనులు 
పనుల్లో పాల్గొన్న 3600 మంది కార్మికులు, 500 మంది సాంకేతిక సిబ్బంది
దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి దేవినేని ఉమ 
హర్షం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు