ప్రాణాలకు తెగించి యువతిని కాపాడారు : శభాష్ పోలీస్

కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019)

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 10:27 AM IST
ప్రాణాలకు తెగించి యువతిని కాపాడారు : శభాష్ పోలీస్

కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019)

కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో ఓ యువతి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. పులిగడ్డ-పెనుముడి వారధి పైనుంచి డిగ్రీ విద్యార్థిని ఆదివారం(డిసెంబర్ 8,2019) ఉద‌యం కృష్ణానదిలోకి దూకింది. ఘటనా స్థలానికి దగ్గరలోనే అవనిగడ్డ పోలీసులు నో యాక్సిడెంట్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యువతి నదిలోకి దూకడాన్ని చూసిన ASI మాణిక్యాలరావు, కానిస్టేబుల్‌ గోపిరాజు ఏమాత్రం లేట్ చేయకుండా.. వెంటనే నదిలోకి దూకారు. ప్రాణాలకు తెగించి ఆమెని కాపాడారు. యువతిని బయటకు తీసుకొచ్చారు.

ఆ వెంటనే స్థానికుల సాయంతో యువతిని అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. ప్రాణాలకు తెగించి యువతిని కాపాడిన పోలీసులను స్థానికులు, ఉన్నతాధికారులు అభినందించారు. శభాష్ పోలీస్ అని ప్రశంసించారు. కాగా, ఆ యువతి ఎందుకు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

కొన్ని రోజుల కిందటే విజయవాడ కృష్ణలంక దగ్గర బందరు కాలువలో కొట్టుకుపోతున్న ఓ మహిళను ప్రాణాలకు తెగించి రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ అర్జునరావు కాపాడారు. నదిలో దూకి మరీ ఆమెను బయటకు తీసుకొచ్చారు. ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత కృతిమ శ్వాస అందించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాలను నిలపడంలో ఆయన తనవంతు కృషి చేశారు. ఆర్ఎస్ఐ అర్జునరావును సీఎం జగన్ అభినందించారు. ప్రధానమంత్రి లైఫ్‌ సేవింగ్‌ మెడల్‌కు ప్రభుత్వం తరుపున సిఫార్సు చేయాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.