సీఎం సొంత జిల్లాలో కలకలం : రూ.7లక్షల విలువైన మద్యం సీజ్

చిత్తూరు: ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కలకలం చెలరేగింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వి.కోట మండలం కంబార్లపల్లెలో భారీగా మద్యం

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 04:52 AM IST
సీఎం సొంత జిల్లాలో కలకలం : రూ.7లక్షల విలువైన మద్యం సీజ్

చిత్తూరు: ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కలకలం చెలరేగింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వి.కోట మండలం కంబార్లపల్లెలో భారీగా మద్యం

చిత్తూరు: ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కలకలం చెలరేగింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వి.కోట మండలం కంబార్లపల్లెలో భారీగా మద్యం పట్టుబడింది. ఓ మామిడి తోటలో  రూ.7లక్షల విలువైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లను మామిడి తోటలో అక్రమంగా నిల్వ ఉంచారు. 8వేల 170 మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. మామిడి తోట  యజమాని శ్రీరాములుపై కేసు నమోదు చేశారు.

మామిడి తోటలో అక్రమంగా పెద్ద స్థాయిలో మద్యం నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. మామిడి తోటలో సోదాలు చేశారు. సోదాల్లో మద్యం బాటిళ్ల కేసులు పట్టుబడ్డాయి. మొత్తం 170  కేసులు ఉన్నాయి. ఇదంతా చీప్ లిక్కర్ గా గుర్తించారు. వి.కోట మండలానికి దగ్గరలో ఉండే కర్నాటక నుంచి మద్యాన్ని తీసుకొచ్చి నిల్వ ఉంచినట్టు పోలీసులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు,  వారికి పంపిణీ చేసేందుకు వీటిని దాచి ఉంచినట్టు అనుమానిస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వారు ఈ మద్యం బాటిళ్లు తెప్పించారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.