మహిళలు స్నానం చేస్తుండగా..డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్నారంటూ పోలీసులపై మందడం రైతుల దాడి

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 09:58 AM IST
మహిళలు స్నానం చేస్తుండగా..డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్నారంటూ పోలీసులపై మందడం రైతుల దాడి

మహిళలు స్నానం చేస్తుండగా పోలీసులు డ్రోన్ కెమెరాలో షూట్ చేస్తున్నారని ఆరోపిస్తూ.. మందడం రైతులు పోలీసు ఎస్సై, కానిస్టేబుల్స్ లను అడ్డుకున్నారు. మీరు పోలీసులా? లేక గూండాలా? అంటూ మందడం రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసుల వద్ద ఉన్న డ్రోన్ లను, వాకీ టాకీలను లాక్కున్నారు. దీంతో రైతులు-పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

ఎస్సై, కానిస్టేబుల్స్ లను అడ్డుకున్న రైతులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా మరికొంతమంది రైతులు పోలీసులను అడ్డుకున్నారు. దాంతో మరింతగా రెచ్చిపోయిన పోలీసులు రైతులను తీవ్రమైనఅసభ్య పదజాలంతో దూషించారు. దీంతో రైతులు కర్రలతో పోలీసులపైకి తిరగబడ్డారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగింది. 

దీంతో రైతులు..పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకోవటంత ఏపీ రాజధాని అమరావతి పరిధిలో మందడంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో మేం పోలీసులం..మాపైనే దాడికి దిగుతారా? అంటూ ఖాకీలు క్రౌర్యం చూపారు. రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రైతులు కూడా మమ్మల్ని ..మా ఆడవారిని అవమానిస్తు తిరిగి మమ్మల్నే అరెస్ట్ లు చేస్తారా? అంటూ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరగటంతో ఆ మందడంలో ఉద్రిక్తత నెలకొంది.

కాగా అమరావతి గురించి దాదాపు గత రెండు నెలల నుంచి మందడం రైతులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. దీంతో రైతుల నిరసన కార్యక్రమాలను పోలీసులు డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆడవాళ్లు స్నానంచేస్తుండగా డ్రోన్ కెమెరాలతో షూట్ చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డ్రోన్ షూటింగ్ ఆపేయాలని పోలీసులకు రైతులు కోరారు. కానీ వారు దాన్ని కొనసాగిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తు పోలీసుల వద్ద ఉన్న డ్రోన్ ను..వారి వాకీ టాకీలను లాక్కోవటంతో రైతులకు..పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవటం మందడంలో ఉద్రిక్తత నెలకొంది.

Read More>>ఢిల్లీ ప్రచారంలో….AI టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోలు షేర్ చేసిన బీజేపీ