చంద్రబాబు వల్లే రాజకీయాలు కలుషితం అయ్యాయి

చంద్రబాబు వల్లే రాజకీయాలు కలుషితం అయ్యాయి

చంద్రబాబు వల్లే రాజకీయాలు కలుషితం అయ్యాయి

విజయవాడ: దేశంలో రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని వైసీపీ నేత కొలుసు పార్ధసారధి ఆరోపించారు. గతంలో రైతు కూడా రాజకీయాల్లో పోటీ చేసేవాడని, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాక బడా బాబులకు తప్ప సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.”చంద్రబాబు చేసిన భూ కబ్జాలు ఏపీ చరిత్రలో ఎవరూ చేసి ఉండరు….చంద్రబాబు లాంటి నీచమైన మనిషి ఈ భూమ్మీద ఉండరు. వివేకా మరణిస్తే చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వటం సిగ్గు చేటని” పార్ధసారధి వ్యాఖ్యానించారు.
Read Also : చంద్రబాబుని చెడుగుడు ఆడిన పోసాని

ఓటమి భయంతో టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసులో ఖచ్చితంగా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వివేకా మరణం అనంతరం జగన్ తీసుకున్న నిర్ణయాలే ఆయన శాంతి కోరుకునే వ్యక్తి అనటానికి నిదర్శమని ఆయన చెప్పారు.
Read Also : ఎవరీ కొమ్మా పరమేశ్వర్ రెడ్డి : వివేక హత్య తరువాత మాయం

×