మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రిలోనే దిశ నిందితుల మృతదేహాలు : ఎన్ హెచ్ ఆర్ సీ పరిశీలించాకే అంత్యక్రియలు

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 04:10 PM IST
మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రిలోనే దిశ నిందితుల మృతదేహాలు : ఎన్ హెచ్ ఆర్ సీ పరిశీలించాకే అంత్యక్రియలు

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.

దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు. రేపు ఎన్ హెచ్ ఆర్సీ ప్రతినిధులు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రానున్నారు. ఎన్ హెచ్ ఆర్ సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  

ఎన్ కౌంటర్ అయిన ఆరిఫ్, నవీన్, శివ, చెన్నకేశవులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో పోస్టుమార్టం చేశారు. ఆస్పత్రి దగ్గర భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఫోరెన్సిక్ వైద్యులు, టీమ్ ఆఫ్ ప్యానల్ డాక్టర్లతోపాటుగా వీడియోస్ రికార్డు అనాలిసిస్ టీమ్ కూడా పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో వీడియో రికార్డింగ్ అనాలిసిస్ ఆధారంగా పూర్తిస్థాయిలో నివేదికను రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది.
అవే ఎవిడెన్స్ గా మారుతుంది కాబట్టి ఎక్కడెక్కడా గాయాలు అయ్యాయి, ఏ స్థలంలో బుల్లెట్స్ తగిలాయా. అలాగే వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి. వారి శరీరాలపై ఎలాంటి గాయాలు ఉన్నాయన్న విషయాలన్నింటినీ క్రోడీకరించి వీడియో రికార్డింగ్ అనాలిసిస్ ద్వారా నివేదిక అందజేసే అవకాశం ఉంటుంది. 

షాద్ నగర్ ఎస్ హెచ్ వో స్టేషన్ ఆఫీసర్ కాపీలు, పంచనామా కాపీలు తీసుకొచ్చిన తర్వాత నేరుగా చటాన్ పల్లి నుంచి అర్ధగంట వ్యవధిలోనే నలుగురు నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. పంచనామా కాపీలతోపాటు ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా పోస్టుమార్టం చేశారు. మొదటగా మహ్మద్ ఆరిఫ్ మృతదేహానికి పోస్టుమార్టం కంప్లీట్ అయిన తర్వాత జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. 

దిశ హత్యాచార నిందితులను పోలీసులు శుక్రవారం(డిసెంబర్ 6, 2019) తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చేశారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. (నవంబర్27, 2019) దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. దిశ కేసులో నిందితులను గురువారం (డిసెంబర్5, 2019) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.