ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు

  • Published By: veegamteam ,Published On : April 9, 2019 / 03:45 PM IST
ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు

ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌పై బదిలీ వేటు పడింది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేయడంతో.. ఎన్నికల విధుల నుంచి ప్రవీణ్‌ను తప్పిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. టీడీపీకి అనుకూలంగా ఎస్పీ పనిచేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదుతో కోయ ప్రవీణ్‌ని బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం ఎస్పీగా ముగ్గురు అధికారుల పేర్లని ఈసీ పరిశీలిస్తోంది.