ఏప్రిల్ నుంచి : రూపాయికే కిలో బియ్యం

2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 05:41 AM IST
ఏప్రిల్ నుంచి : రూపాయికే కిలో బియ్యం

2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ

2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలు తినలేని బియ్యం ఇస్తే.. తమ ప్రభుత్వం మాత్రం నాణ్యమైన బియ్యం ఇస్తోందన్నారు. ప్రజలు తినగలిగే బియ్యాన్ని ఇస్తున్నందుకు గర్వంగా ఉందని సీఎం జగన్ చెప్పారు. టీడీపీ హయాంలో ఇచ్చిన బియ్యం కంటే.. మేలైన బియ్యాన్ని శ్రీకాకుళంలో ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.

ఏపీ అసెంబ్లీ రెండో రోజు శీతాకాల సమావేశాల్లో సన్నబియ్యంపై చర్చ సందర్భంగా టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సన్నబియ్యం విషయంలో ప్రభుత్వం ఎందుకు మాట తప్పిందని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ముందు సన్న బియ్యం అన్నారు.. ఇప్పుడు నాణ్యమైన బియ్యం అంటున్నారు.. ఎందుకిలా మాట తప్పారని అచ్చెన్న అడిగారు. పాదయాత్ర సమయంలో సన్నబియ్యం ఇస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడేమో నాణ్యమైన బియ్యం అంటున్నారు.. ఎందుకీ యూటర్న్ అని నిలదీశారు.

దీనికి సీఎం జగన్ ఘాటుగా బదులిచ్చారు. అసలు సన్న బియ్యం అనే పేరే లేదని స్పష్టం చేశారు. సన్న బియ్యం అంటే ఏంటో తెలుసుకుంటే అచ్చెన్నకు నాలెడ్జ్ పెరుగుతుందన్నారు. స్వర్ణ రకం బియ్యాన్నే సన్నబియ్యం అంటారని వివరించారు. సన్న బియ్యం, నాణ్యమైన బియ్యం మధ్య తేడా తెలుసుకుంటే టీడీపీ సభ్యులకు కొంచెం జ్ఞానం పెరుగుతుందని సూచించారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తామని ప్రకటించారు. ఇంతకుముందు నూకలు 25శాతం ఉండేవని, ఇప్పుడు కేవలం 15శాతం మాత్రమే ఉంటాయన్నారు.

సన్నబియ్యం సరఫరా వివాదంపై మంత్రి రంగనాథరాజు స్పందించారు. స్వర్ణమసూరి బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణమసూరి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. కిలో రూ.37 విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వం రూపాయికే ప్రజలకు ఇస్తుందన్నారు.