TRSకి ఓటు వేస్తే BJPకి వేసినట్టే

మహబూబ్ నగర్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 10:36 AM IST
TRSకి ఓటు వేస్తే BJPకి వేసినట్టే

మహబూబ్ నగర్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వనపర్తిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లపై రాహుల్ మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేయడంలో మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అన్నారు. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ప్రాజెక్టుల పేర్లు మార్చడమే కేసీఆర్ కు తెలుసు అని విమర్శించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని రాహుల్ చెప్పారు. టీఆర్ఎస్ అవినీతితో తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీని రద్దు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పేదల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రధాని మోడీ పేదలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేశారని రాహుల్ మండిపడ్డారు. మోడీ.. పేదలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తే.. పేదరికంపై కాంగ్రెస్ సర్జికల్ స్ట్రయిక్స్ చేయబోతోందని రాహుల్ చెప్పారు. ప్రధాని అయ్యాక ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామని హామీ ఇచ్చిన మోడీ.. ప్రధాని అయ్యాక మోసం చేశారని రాహుల్ ఆరోపించారు. తాను మాత్రం మోడీలా అబద్దాలు చెప్పనన్నారు.

పేదల కోసం కనీస ఆదాయ పథకం తీసుకొస్తామన్నారు. ఇది చారిత్రక పథకం అన్న రాహుల్.. ఈ స్కీమ్ కింద ప్రతి పేదవాడి ఖాతాలో ఏటా రూ.72వేలు బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. కాంగ్రెస్ నిర్ణయంతో మహిళలు ఆర్థికంగా శక్తిమంతులవుతారని చెప్పారు.