రైల్వేశాఖ పైసా వసూల్ : ఇకనుంచి యూజర్ చార్జీలు బాదుడు

  • Published By: nagamani ,Published On : September 18, 2020 / 11:14 AM IST
రైల్వేశాఖ పైసా వసూల్ : ఇకనుంచి యూజర్ చార్జీలు బాదుడు

దేశంలోనే అతి పెద్ద ప్రజా రవాణా సంస్థ రైల్వేశాఖ. సామాన్యులకు రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తుంటారు. అటువంటి రైల్వేశాఖ కూడా ప్రజలపై భారాన్ని మోపేందుకు సిద్దమవుతోంది. ప్రయాణికులకు రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది. ఇక నుంచి రైలు టికెట్ ధరతో పాటు యూజర్ చార్జీలు కూడా వసూలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు.


రద్దీగా ఉండే స్టేషన్లతో పాటు కొత్తగా ఆధునీకరణ జరుగుతున్న స్టేషన్లలో వీటిని అమలు చేస్తామని చెప్పారు. ఈ వసూళ్లు దేశంలో 7 వేల రైల్వే స్టేషన్లలో 10 నుంచి 15 శాతం స్టేషన్లలో ఇది అమలు కానుంది. దీంతో టికెట్ ధరతో పాటు సౌకర్యాల కల్పన భారం కూడా ప్రయాణికుడిపై పడనుంది.



https://10tv.in/mp-ashok-gasti-critical-condition/
ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చైర్మన్‌ వీకే యాదవ్‌ తెలిపారు. అతి తక్కువ చార్జీలను మాత్రమే ఉంటాయని అధికంగా ఉండవని స్పష్టం చేశారు.ప్రస్తుతం దేశంలోని 7 వేల స్టేషన్లను ఆధునీకరిస్తున్నామనీ..ఇది పూర్తైన తర్వాతే యూజర్ చార్జీలు వసూళ్లు ఉంటాయని..వీటి ద్వారా రైల్వే సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉందని అన్నారు.


కాగా..యూజర్ చార్జీల విషయంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. యూజర్ చార్జీలతో కలిపి ఇక నుంచి రైల్వే టికెట్ ధరలు పెరగడం ప్రయాణీకులను కలవర పెడుతోంది. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ప్రజలపై పడుతున్న ఒక్కో భారంతో పాటు రైల్వే కూడా ఈ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యుడికి మరింత భారం తప్పదని వాపోతున్నారు.


అంతేమని ఏ కష్టమొచ్చినా ప్రజలే భరించాలి. ప్రభుత్వాలు మాత్రం ప్రజల కోసమే ఇది చేస్తున్నామని చెబుతుంటాయి. కరోనాతో దేశంలోని ప్రతీ కుటుంబం ఆర్థికంగా కుదేలైపోయింది. ఆర్థికంగాను.. ఆరోగ్యంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్న క్రమంలో క్రమేపీ అన్ని చార్జీలు పెరుగుతూ ప్రజల నడ్డి విరుస్తున్నాయి.