అందుకే హైదరాబాద్ నుంచి వచ్చేశా

ప్రకాశం : తాను హైదరాబాద్ వీడటానికి కారణం ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 12:56 PM IST
అందుకే హైదరాబాద్ నుంచి వచ్చేశా

ప్రకాశం : తాను హైదరాబాద్ వీడటానికి కారణం ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.

ప్రకాశం : తాను హైదరాబాద్ వీడటానికి కారణం ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రులను ఎన్నో తిట్లు తిట్టారని, ఆ కారణంతోనే హైదరాబాద్ నుంచి వచ్చేశా అని చంద్రబాబు చెప్పారు.  కేసీఆర్ ఆంధ్రులను తిట్టడం తనకు బాధ కలిగించిందన్నారు. కేసీఆర్ వైఖరి నచ్చకనే తాను హైదరాబాద్ నుంచి వచ్చేశానని చంద్రబాబు వివరించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో  చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ చీఫ్ జగన్, సీఎం కేసీఆర్, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానే అన్న చంద్రబాబు.. హైదరాబాద్ లాంటి నగరాన్ని వదిలేసుకోవడం బాధ కలిగించిందన్నారు. ఏపీలో హైదరాబాద్ లాంటి 20 నగరాలను తయారు చేస్తానని చంద్రబాబు హామీ  ఇచ్చారు. రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టామన్నారు. పసుపు కుంకుమతో ఆడబిడ్డలను ఆదుకుంటున్నామని చెప్పారు.
Read Also : వరంగల్ ఎవరికి వరం : కాంగ్రెస్‌కు కలిసొస్తుందా? కారు దూసుకుపోతుందా?

సంపద సృష్టిస్తా.. సృష్టించిన సంపద పేదలకు పంచుతా అని చంద్రబాబు  అన్నారు. పండుగకు 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. కోటి మంది మహిళలకు స్మార్ట్ ఫోన్ లు ఇస్తామన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ డబ్బు అకౌంట్ లో పడుతుందని చంద్రబాబు చెప్పారు. చంద్రన్న  బీమా పరిధిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచుతామన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు అడ్డుకునేందుకు చాలా కుట్రలు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం నిర్మాణం అడ్డుకునేందుకు కేసీఆర్, మోడీ చాలా ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పోలవరం  నిర్మాణ పనులు జరగడం లేదన్న ప్రధాని మోడీ ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. మొన్న రాజమండ్రికి వచ్చిన మోడీ.. ఓ 5 నిమిషాలు పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్లి ఉంటే.. ఆ పనులు చూసి ఆసూయతో కళ్లు  తిరిగి హెలికాప్టర్ నుంచి దూకేసేవారని ఎద్దేవా చేశారు. ఎవరు సహకరించినా, సహకరించకపోయినా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆగవని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం పూర్తి చేసే  బాధ్యత తనది అన్నారు. నదులను అనుసంధానం చేసే బాధ్యత కూడా తనదే అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read Also : ఖమ్మం, మానుకోటలో ఎరుపు మెరిసేనా : పట్టుకోసం కమ్యూనిస్టుల దృష్టి