వరి విరగ పండింది : అన్నదాతల్లో ఆనందాలు

సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 03:37 PM IST
వరి విరగ పండింది : అన్నదాతల్లో ఆనందాలు

సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో

సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో రైతుల లోగిళ్లు ధాన్యపు రాసులతో తులతూగుతున్నాయి. ధాన్యంతో అన్నదాతల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సారి మంచి ధర రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  సంగారెడ్డి జిల్లాలో ధాన్యం దిగుబడులపై ప్రత్యేక కథనం. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి ఏటా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇలాంటి సాగు అనుకూల విధానాలతో సంగారెడ్డి జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరిగాయి.

 
సంగారెడ్డి జిల్లాలో లక్ష్యానికి మించి.. వరి సాగు అయింది. జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 16వేల 975హెక్టార్లు. దీనికి మించి 17వేల 701హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. 2018లో 44వేల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వస్తే… ఈసారి 87వేల 109 మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలవడం వల్లనే.. ఈ దిగుబడులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.

 

రైతులు పండించిన పంటలకు గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ధరలు లభించాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 75 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు గరిష్టంగా 1,770 రూపాయల ధర దక్కింది. గతంలో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఇబ్బంది లేకుండా అమ్మకాలు జరిగాయి. ధాన్యం అమ్మిన 16వేల 818మంది రైతులకు 154 కోట్ల 18 లక్షల రూపాయలకు పైగా చెల్లింపులు చేశారు. ప్రభుత్వం అవలంభిస్తున్న సాగు అనుకూల విధానాలపై రైతు సమన్వయ సమితి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

ధాన్యం దిగుబడులు పెరిగి.. మంచి ధరలు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలం తర్వాత తమ కష్టాలు తొలగిపోయాయని రైతులు సంతోషిస్తున్నారు. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. వ్యసాయం దండుగ అనే రోజులు క్రమంగా తొలగిపోతూ పండుగగా భావించే రోజులు వస్తున్నాయని అన్నదాతలు ఖుషీ అవుతున్నారు.